మెరపులాంటి మైమరపు.. చూస్తే ఫ్లాట్!!

Posted By: Super

మెరపులాంటి మైమరపు.. చూస్తే ఫ్లాట్!!

 

ASUS ఆరాధికులకు ఉత్తేజకర వార్త.. అత్యత్తమ కంప్యూటింగ్ విలువలతో పాటు ఆకర్షణీయమైన స్టైల్‌ను ఒదిగి ఉన్న రెండు ట్రెండీ జెన్‌బుక్‌లను యూకెలో విక్రయించేందుకు అసస్ స్నన్నాహాలు చేస్తుంది. గోల్ట్ ఇంకా పింక్ కలర్ వేరియంట్‌లలో  డిజైన్ కాబడిన ఈ క్లాసీ గ్యాడ్జెట్స్ తొలిచూపులోనే ఆకర్షితులను చేస్తాయి. UX21, UX31 మోడల్స్‌లో రూపుదిద్దుకున్న ఈ అల్ట్రాబుక్స్ ఏప్రిల్ చివరి నుంచి యూకే మార్కెట్లలో లభ్యం కానున్నాయి.

అసస్ UX21 ఫీచర్లు:

- 11.6 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్ (స్ర్కీన్ రిసల్యూషన్1366 x 768పిక్సల్స్),

- 2367M కోర్ ఐ3 ప్రాసెసర్,

-    విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

-    128జీబి హార్డ్ డ్రైవ్,

-    ఇంటెల్ QS67 చిప్‌సెట్,

-    యూఎస్బీ కనెక్టువిటీ,

-    స్టాండర్డ్ పాలిమర్ బ్యాటరీ,

-    బరువు 2.4 ల్యాబ్స్.

అసస్ UX31 ఫీచర్లు:

13.3 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్ (రిసల్యూషన్ 1600 x 900పిక్సల్స్),

డ్యూయల్ కోర్ ఇంటెల్ 1.7గిగాహెడ్జ్ కోర్ ఐ5 ప్రాసెసర్,

4జీబి ర్యామ్,

విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

128జీబి హార్డ్ డ్రైవ్,

వై-ఫై

బరువు 2.9 ల్యాబ్స్,

3.5ఎమ్ఎమ్ ఆడియో ఇన్‌పుట్, అవుట్‌పుట్

ఆకర్షణీయమైన శైలిలో తయారుకాబడిన ఈ సాంకేతిక పరికరాలు ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటాయి. వీటి ధరలను పరిశీలిస్తే  అసస్ UX21 రూ.50,000, అసస్ UX31 రూ.55,000. వీటిని త్వరలోనే ఇతర దేశాల్లో విడుదల చేయునున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot