మార్కెట్లోకి అసస్ సరికొత్త ల్యాప్‌టాప్‌లు!

Posted By: Prashanth

మార్కెట్లోకి అసస్ సరికొత్త ల్యాప్‌టాప్‌లు!

 

న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన పర్సనల్ కంప్యూటర్‌ల తయారీ బ్రాండ్ అసస్, చిప్ తయారీ దిగ్జజం ఇంటెల్, సాఫ్ట్‌వేర్ జెయింట్ మైక్రో‌సాఫ్ట్‌ల భాగస్వామ్యంతో భారత్‌లో రెండు ఎస్ సిరీస్ అల్ట్రాబుక్‌లతో పాటు ఎఫ్ సిరీస్ నోట్‌బుక్‌ను మంగళవారం విడుదల చేసింది. ఎస్ సరీస్ నుంచి విడుదలైన అల్ట్రాబుక్‌ల వివరాలు: అసస్ ఎస్56సీఏ- XX030R(ధర రూ.46,999), అసస్ ఎస్56సీఏ- XX056R(ధర రూ.52,999),

ప్రధాన ఫీచర్లు:

బరువు 2.4కిలో గ్రాములు,

15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ గ్లేర్ డిస్‌ప్లే,

0.92పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా (రిసల్యూషన్1280X 720పిక్సల్స్),

విండోస్ 7 హోమ్ బేసిక్ ఆపరేటింగ్ సిస్టం,

ఇన్‌బుల్ట్ ఆప్టికల్ డ్రైవ్,

ఇంటెల్ ఐవీ‌బ్రిడ్జ్ ప్రాసెసర్,

24జీబి సాటా స్లేట్ డ్రైవ్,

హర్డ్‌డిస్క్ డ్రైవ్ 500జీబి వర్షన్, 750జీబి వర్షన్,

బ్యాటరీ స్టాండ్‌బై 13 రోజులు,

సంవత్సరం వారంటీ.

ఎఫ్ సిరీస్ నుంచి విడుదలైన అసస్ ఎఫ్501ఏ-XX187R నోట్‌బుక్ ప్రధాన ఫీచర్లు:

విండోస్7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

15.6 అంగుళాల హైడెఫినిషన్ గ్లేర్ డిస్‌ప్లే,

ఇంటెల్ కోర్ఐ3 ప్రాసెసర్,

0.3 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్,

హెచ్‌డిఎమ్ఐ అవుట్,

యూఎస్బీ కనెక్టువిటీ,

బ్యాటరీ స్తాండ్‌బై 14 రోజులు,

ధర రూ.35,999,

సంవత్సరం వారంటీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot