Home
Computer

తేలికైన ల్యాప్‌టాప్!!

By Prashanth
Asus


ప్రయాణ సందర్భాల్లో సౌకర్యవంతంగా ఉండే విధంగా అతితేలికైన ల్యాపీని అసస్ డిజైన్ చేసింది. అసస్ ప్రో ‘బి’ సిరీస్ నుంచి 23E మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ 12.5 అంగుళాల స్ర్కీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రలోహాన్ని డివైజ్ శరీర నిర్మాణంలో ఉపయోగించారు. ఏర్పాటు చేసిన స్పిల్ ప్రూఫ్ కీబోర్డ్ ప్రతికూల వాతవరణాల్లో సైతం సమర్ధవంతంగా పనిచేస్తుంది. బిజినెస్ ప్రొఫెషనల్స్‌తో పాటు వ్ళత్తి రిత్యా ప్రయాణాలు సాగించే వారికి ఈ డివైజ్ ఉత్తమ ఎంపిక.

నిక్షిప్తం చేసిన సెకండ్ జనరేషన్ ఇంటెల్ ఐ సిరీస్ ప్రాసెసర్ ల్యాపీ పటిష్టతను పెంచుతుంది. i3, i5, i7 వేరియంట్‌లలో ఈ ప్రాససెర్ లభ్యమవుతుంది. అవసరాన్ని బట్టి వీటిని ఎంపిక చేసుకోవచ్చు. పొందుపరిచిన 8 జీబి ర్యామ్ ల్యాపీ పని సామర్ధ్యాన్ని మరింత వేగిరితం చేస్తుంది. హార్డ్‌డిస్క్ స్పేస్ 750జీబి. ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్‌తో ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు. బ్లూటూత్, యూఎస్బీ, హెచ్డీఎమ్ఐ,ఇతర్ నెట్ వ్యవస్థలు డివైజ్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తాయి. 3 సెల్ బ్యాటరీ బ్యాకప్ విషయంతో స్వల్ప నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ‘అసస్ ప్రో B23E’ విలువ రూ.50,000 ఉండొచ్చని అంచనా.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X