హై డెఫినిషన్ తెర బిగించారు... అంతా అదుర్సే!!

By Super
|
హై డెఫినిషన్ తెర బిగించారు... అంతా అదుర్సే!!


అసస్ తాజాగా లాంచ్ చేసిన ల్యాప్‌టాప్ ‘యూఎక్స్21ఏ’ హై డెఫినిషన్ స్ర్కీన్‌ను ఒదిగి ఉండటంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు హుందా అయిన పనితీరును ప్రదర్శిస్తాయి. అల్యూమినియం చాసిస్‌తో డిజైన్ కాబడిన ఈ ల్యాపీ ప్రొఫెష్‌నల్ లుక్‌ను సంతరించుకుంది.

 

ల్యాప్‌టాప్ ఇతన ఫీచర్లు పరిశీలిస్తే:

11.6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, రిసల్యూషన్ 1920 X 1080పిక్సల్స్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెడ్జ్ ఐవీ‌ బ్రిడ్జ్‌కోర్ ప్రాసెసర్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్, ఇంటెల్ చిప్‌సెట్, ఇన్‌బుల్ట్ వెబ్‌క్యామ్, వీడియో రికార్డింగ్ సౌలభ్యత, 4జీబి ఇంటర్నల్ ర్యామ్, 250జీబీ ఎస్ఎస్‌డి, వై-పై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లౌడ్ స్పీకర్స్, 35వాట్ బ్యాటరీ (బ్యాకప్ 5 గంటలు), ధర అంచనా రూ.50,000.

అభిమానుల నిరీక్షణ ఫలిచింది:

అభిమానుల నిరీక్షణ ఫలిచింది.. వాయిదాపడుతూ వస్తున్న ఓ బృహత్తర నవీకరణ ఆచరణకు నోచుకుంది.. వివరాల్లోకి వెళితే, ప్రముఖ బ్రాండ్ ఏసర్ రూపొందించిన ‘ఐకోనియా ట్యాబ్ 500’ టాబ్లెట్ కంప్యూటర్‌కు ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్ లభించింది. ప్రస్తుతానికి ఈ తాజా ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్ యూఎస్, కెనడాలోని యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. తొలత ఈ అప్‌డేట్‌ను ఫిబ్రవరిలో ప్రకటించారు. పలు కారణాల రిత్యా ఏప్రిల్‌కు వాయిదా పడింది.

ఈ తాజా వోఎస్ అప్‌డేట్‌తో చేకూరే లాభాలు:

మెరుగైన యూజర్ ఇంటర్ ఫేస్,

క్వాలిటీ కమ్యూనికేషన్,

యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్,

వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X