‘జంప్ జలానీ’కి సిద్ధంగా ఉన్నారు?

విండోస్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8’ ఈ అక్టోబర్ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ నేపధ్యంలో అనేక గ్యాడ్జెట్ తయారీ బ్రాండ్‌లు విండోస్ 8 వైపు అడుగులు వేసేందకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో మొదటిదైన అసస్ ఇప్పటికే విండోస్ 8 ఆధారిత టాబ్లెట్ కంప్యూటర్‌ను రూపొందించే ప్రయత్నంలో నిమగ్నమైంది. ‘అసస్ విండస్ టాబ్లెట్ 600’గా మార్కెట్లోకి రానున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ ఆకర్షణీయమైన డిజైనింగ్ అదేవిధంగా అత్యుత్తమ మల్టీమీడియా ఫీచర్లను ఒదిగి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ గ్యాడ్జెట్ కీలక స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలు ఇటీవల బహిర్గతమయ్యాయి.
విండోస్ టాబ్లెట్ 600 కీలక ఫీచర్లు:
- సూపర్ ఐపీఎస్ టెక్నాలజీతో కూడిన 10.1అంగుళాల డిస్‌ప్లే, రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
- మల్టీ టచ్‌స్ర్కీన్, ఆటాచబుల్ క్వర్టీ-టైప్ కీబోర్డ్,
- 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
- 2జీబి ర్యామ్.
- 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ,
- 4జీ ఎల్ టీఈ రేడియో,
- బ్లూటూత్ 4.0,
- వై-పై కనెక్టువిటీ,
- క్వాడ్ టెగ్రా 3 ప్రాసెసర్,
- విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
- ఎన్-విడియా 12-కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.
యూఎస్, యూకె, ఇండియా దేశాల్లో అసస్ విండస్ టాబ్లెట్ 600ను అక్టోబర్ నాటికి అందుబాటులోకి తేనున్నారు. ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








