టాబ్లెట్ పై టార్గెట్..?

Posted By: Prashanth

టాబ్లెట్ పై టార్గెట్..?

 

ఈ ఏడు ప్రధానంగా టాబ్లెట్ పీసీల సెగ్మంట్ పై దృష్టిసారించిన అసస్(Asus) ‘మెమో 171’ మోడల్ లో స్లిమ్ తరహా టాబ్లెట్ ను డిజైన్ చేసింది. యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టంగా గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రాయిడ్ హనీకూంబ్ వోఎస్ పై ఈ డివైజ్ రన్ అవుతుంది.

7 అంగుళాల స్ర్కీన్ ఐపీఎస్+ (IPS+) ప్యానల్ ను ఒదిగి ఉంటుంది. శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ను టాబ్లెట్ లో నిక్సిప్తం చేశారు. 1జీబి ర్యామ్ మెమరీ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. డివైజ్ ఇంటర్నల్ మెమరీ 16జీబి.

పొందుపరిచిన ‘178 డిగ్రీ వ్యూ యాంగిల్’ సౌలభ్యతతో ఫొటోలు అదేవిధంగా డాక్యుమెంట్ లను క్లియర్ గా వీక్షించవచ్చు. టచ్ వ్యవస్థ మన్నికగా స్పందిస్తుంది. ఉత్తమ పిక్సల్ రిసల్యూషన్ సామర్ధ్యంతో కూడిన డ్యూయల్ కెమెరా వ్యవస్థను టాబ్లెట్ లో దోహదం చేశారు. ఈ కెమెరాల ద్వారా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించుకోవటంతో పాటు ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు. ఐరోపా తదితర దేశాల్లో త్వరలో విడుదల కాబోతున్న ‘అసస్ మెమో 171 టాబ్లెట్’ ధర వివరాల తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot