అసస్ నుంచి టెగ్రా 3 పవర్ టాబ్లెట్!!!

Posted By: Staff

అసస్ నుంచి టెగ్రా 3 పవర్ టాబ్లెట్!!!

 

ఈ ఏడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో’ టెక్ ప్రపంచానికి కొత్త వైభవాన్ని తెచ్చిపెట్టింది.. ఆడ్వాన్సుడ్ టెక్నాలజీతో కూడిన అనేక గ్యాడ్జెట్‌లు ఈ వేదిక పై ఆవిష్కరించబడ్డాయి... టెక్ విభాగానికి చెందని ప్రతి ఒక్క బ్రాండ్ తన భవిష్యత్ కార్యచరణను ఈ ప్రదర్శన సాక్షిగా ప్రపంచానికి వెల్లడించింది... ఆధనిక పరిజ్ఞానంతో రూపొందించిన కొత్త తరహా పర్సనల్ కంప్యూటర్లతో పాటు టాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఈ ఎగ్జిబిషన్ ద్వారా టెక్ దునియాకు సుపరిచతమయ్యాయి.

స్టాండర్డ్ బ్రాండ్‌లలో ఒకటైన ‘అసస్’(Asus) శక్తివంతమైన టాబ్లెట్ పీసీని ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి తెచ్చింది. ‘అసస్ మెమో 370T’గా రూపుదిద్దుకున్న ఈ స్లిమ్ కంప్యూటింగ్ పీసీలో టెగ్రా 3 ప్రాసెసర్‌తో పాటు సమర్దవంతమైన ఫీచర్లను లోడ్ చేశారు. ఈ టాబ్లెట్ LCD డిస్‌ప్లే 7 అంగుళాల పరిమాణం కలిగి ఉంటుంది. అత్యుత్తమ పనితీరునందించే ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది. ఈ టాబ్లెట్ విడుదలకు సంబంధించి పూర్తి సమచారాన్ని ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’లో వెల్లడిస్తారు. ధర రూ.15000 ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot