స్మూత్ అండ్ కంఫర్ట్ ఫీలింగ్!!!

Posted By: Super

స్మూత్ అండ్ కంఫర్ట్ ఫీలింగ్!!!

 

స్మూత్‌గా రన్ అవుతా కంఫర్ట్ ఫీలింగ్‌కు లోను చేసే కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ను ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు.  ఎన్నో ఉత్తమ కంప్యూటింగ్ డివైజ్‌లను చేరువ చేసిన అసస్ తన కుటుబంలోకి  తాజాగా మరొకరిని ఆహ్వానించింది. అసస్ నుంచి ‘Eee PC 1225B’ మోడల్‌గా డిజైన్ కాబడిన ల్యాప్‌టాప్ తరహా నెట్‌బుక్ ప్రస్తుత మార్కెట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

ఈ డివైజ్ డిస్‌ప్లే 11.6 అంగుళాలు, రిసల్యూషన్ సామర్ధ్యం 1366 x 768 పిక్సల్స్. పొందుపరిచిన డ్యూయల్ కోర్ AMD ఫ్యూజన్ E450 ప్రాసెసర్ వేగవంతమైన పనితీరుకు తోడ్పడుతుంది. ప్రాసెసర్ క్లాక్ వేగం  1.65 GHz. ఏర్పాటు చేసిన

హార్డ్‌డిస్క్ 750జీబి పరిమాణం కలిగి పటిష్ట స్థాయిలో ఉంటుంది. డిజైన్ చేసిన క్వర్టీ కీప్యాడ్ సులవైన టైపింగ్‌కు ఉపకరిస్తుంది.

సిస్టం మెమరీ 2జీబి లేదా 4జీబి ఉండొచ్చు. నెట్‌బుక్ ఇంటర్నెట్ వేగాన్ని మరింత బలపరుస్తూ వై-ఫై వ్యవస్థను దోహదం చేశారు. నిక్షిప్తం చేసిన వెబ్ కెమెరా 0.3 మెగా పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది. డివైజ్‌ను హై డెఫినిషన్ టీవీలకు జత చేసుకునేందుకు గాను ఏర్పాటు చేసిన హెచ్డీఎమ్ఐ కనెక్టువిటీ దోహదపడుతుంది.  అమర్చిన యాఎస్బీ 3.0, 2.0 పోర్ట్స్ వేగవంతమైన డేటా షేరింగ్‌కు తోడ్పడతాయి.

నెట్‌బుక్ డిస్‌ప్లే  హై క్లారిటీతో కూడిన విజువల్స్‌ను అందిస్తుంది. హై డెఫినిషన్ వీడియోలను నాణ్యమైన కోణంలో తిలకించవచ్చు. ప్రయాణ సందర్భాల్లో  ఏ మాత్రం విసుగనిపించదు. నిక్షిప్తం చేసిన వెబ్ కెమెరా ద్వారా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు.

డివైజ్‌కు సంబంధించి ధర ఇతర ఫీచర్ల వివరాలు అతి త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot