జనవరిలో అసూన్ ప్యాడ్‌ఫోన్ 2!

Posted By: Super

 జనవరిలో అసూన్ ప్యాడ్‌ఫోన్ 2!

 

ప్రముఖ టెక్‌బ్రాండ్ అసూస్, ప్యాడ్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా ప్యాడ్‌ఫోన్ 2 పేరుతో సరికొత్త హైబ్రీడ్ డివైజ్‌ను గడిచిన అక్టోబర్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ కమ్ టాబ్లెట్ అమ్మకాలు యూరోప్ ఇంకా ఆసియా మార్కెట్లలో డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈఎఫ్ఐ టైమ్స్ బహర్గితం చేసిన వివరాలు మేరకు భారత్‌లో అసూస్ ప్యాడ్ ఫోన్2 విక్రయాలు జనవరి చివరి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ కీలక వివరాలను అసూస్ ఇండియా  సేల్స్ ఇంకా పంపిణి విభాగపు సంచాలకులు ఖురేషీ వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్లో అసూస్ ప్యాడ్ ఫోన్ రూ,64,999కు లభ్యమవుతోంది. ఈ ధర అమ్మకాల పై ప్రభావం చూపటంతో  ప్యాడ్‌ఫోన్ 2 సమంజమైన ధరల్లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు  వినికిడి. ఈ హైబ్రీడ్ డివైజ్‌ను

స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ అలానే ల్యాప్‌టాప్‌లా ఉపయోగించుకోవచ్చు.

అసూప్ ప్యాడ్ ఫోన్ 2 ఫీచర్లు:

4.7 అంగుళాల సూపర్ ఐపీఎస్+కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

క్వాడోకోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064 సాక్ ప్రాసెసర్,

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్),

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

2జీబి ర్యామ్,

50జీబి అసూస్ వెబ్‌స్టోరేజ్ (రెండు సంవత్సరాల వరకు),

ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ 16జీబి/32జీబి/64జీబి,

కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2140ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

టాబ్లెట్ డాక్ (10.1 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే, 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరువు 514 గ్రాములు, 13- పిన్ కనెక్టర్ పోర్ట్),

కీబోర్డ్ డాక్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot