అక్టోబర్ 16, 2012.. మెమరీలో సేవ్ చేసుకోండి!

Posted By: Prashanth

అక్టోబర్ 16, 2012.. మెమరీలో సేవ్ చేసుకోండి!

 

టెక్నాలజీ ఆరాధికులకు ఆసక్తికర న్యూస్.. తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం అసస్, అక్టోబర్ 16న స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ లక్షణాలతో కూడిన సరికొత్త గ్యాడ్జెట్‌ను ఆవిష్కరించనుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని తైవాన్ అదేవిధంగా ఇటిలీ దేశాలలో ఒకే‌సారి నిర్వహించనున్నారు. అసస్ ప్యాడ్ ఫోన్‌‍కు అప్‌డేటెడ్ వర్షన్‌గా రూపుదిద్దుకున్న ఈ డివైజ్ పేరు ‘అసస్ ప్యాడ్‌ఫోన్ 2’. మీరు చూస్తున్న ఫోటోగ్రాఫ్‌‌ ఇటలీకి చెందిన ప్రముఖ టెక్నాలజీ సైట్ నోట్‌బుక్ ఇటాలీయా బహిర్గతం చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్యాడ్‌ఫోన్2 శక్తివంతమైన క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ ఎస్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. డాక్ సౌలభ్యతను కలిగి ఉన్న ఈ గ్యాడ్జెట్‌ను చిటెకలో ల్యాప్‌‌టాప్‌గా మార్చుకోవచ్చు. అంతేకాదు టాబ్లెట్‍‌లా ఉపయోగపడతుంది.. స్మార్ట్‌ఫోన్‌లా కమ్యూనికేషన్ సేవలందిస్తుంది.

భారత్ మార్కెట్లో అసస్ ప్యాడ్‌ఫోన్:

ప్రముఖ కంప్యూటర్‌ల నిర్మాణ సంస్థ అసస్, స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా హైబ్రీడ్ టాబ్లెట్ ఫీచర్లను ఒదిగి ఉన్న ప్యాడ్‌ఫోన్‌ను మంగళవారం బెంగుళూరులో విడుదల చేసింది. అసస్ ప్యాడ్‌ఫోన్ ఇండియన్ మార్కెట్ ధర రూ.64,999.

ప్రధాన ఫీచర్లు:

ఈ డివైజ్‌ను స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ అదేవిధంగా నోట్‌బుక్‌లా ఉపయోగించుకోవచ్చు. ఫీచర్లు: 4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే(రిసల్యూషన్ సామర్ధ్యం 960 x 540పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 1 జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, 1520 ఎమ్ఏహెచ్ లయోన్ బ్యాటరీ. 16,32,64జీబి మెమరీ కాన్ఫిగరేషన్స్.

కనెక్టువిటీ ఫీచర్లు:

3జీ హెచ్ఎస్‌యూపీఏ 5.76ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌డిపీఏ 21 ఎంబీపీఎస్, వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ 4.0.

ఇతర ఫీచర్లు:

కీబోర్డ్ డాక్, మల్టీటచ్ ప్యాడ్, ఎస్డీకార్డ్ రీడర్, యూఎస్బీ పోర్ట్, హెడ్‌సెట్ స్టైలస్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot