‘అసస్ ప్యాడ్ ఫోన్’...కొత్త పంథా!!

Posted By: Super

‘అసస్ ప్యాడ్ ఫోన్’...కొత్త పంథా!!

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అనుభూతులను, పెద్ద స్ర్కీన్ పై ఆస్వాదించాలనుకునే వారి కల నెరవేరనుంది. మొబైల్ టెక్నాలజీ వ్యవస్థలో కొత్త ఒరవడికి నాంది పలుకుతూ ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘అసస్’ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సమాయుత్తమవుతుంది.

‘స్మార్ట్ ఫోన్ - టాబ్లెట్ పీసీ’ కలయకతో కొత్త గ్యాడ్జెట్‌ను తెరముందు ఆవిష్కరించనుంది. ‘అసస్ ఫ్యాడ్ ఫోన్’గా విడుదలవుతున్న ఈ మోడ్రన్ గ్యాడ్జెట్ అన్ని వర్గాల వినయోగదారులను సంతృప్తిపరుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

‘అసస్ ప్యాడ్ ఫోన్’ యూనిట్‌లో ఫ్యాడ్ ఫోన్ మరియు టాబ్లెట్ పీసీ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేసే ‘ప్యాడ్ ఫోన్’ స్మార్ట్ ఫోన్ 4.3 అంగుళాల డిస్‌ప్లే‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ
స్మార్ట్ ఫోన్‌ను, టాబ్లెట్ పీసీ వెనుకభాగంలో అనుసంధానించుకునే విధంగా ప్రత్యేక వ్యవస్థను అసస్ డిజైన్ చేసింది.

స్మార్ట్ ఫోన్‌ను టాబ్లెట్‌లో అనుసంధానించడం వల్ల ‘10.1’ అంగుళాల టాబ్లట్ డిస్‌ప్లే స్ర్కీన్‌పై స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను ఆస్వాదించవచ్చు. కాపర్, బ్లాక్ వేరియంట్లలో ‘అసస్ ప్యాడ్ ఫోన్’ యూనిట్లు రూపుదిద్దుకున్నాయి.

టచ్ స్క్రీన్, లైట్ సెన్సార్, మల్టీ‌టచ్ వంటి ఆధునిక డిస్‌ప్లే ఫీచర్లు ‘అసస్ ప్యాడ్ ఫోన్’కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మన్నికైన కెమెరా వ్యవస్థను ఈ గ్యాడ్జెట్‌లో రూపొందించారు. 5 మెగా పిక్సల్ డిజిటల్ జూమ్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్‌కు ప్రత్యేకంగా ఎడిషనల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

సింగిల్ సిమ్ సామర్ధ్యం కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్ జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌కు సహకరిస్తుంది. ‘3జీ’ వ్యవస్థకు సహకరించే విధంగా UMTS ఆప్లికేషన్‌‌ను గ్యాడ్జెట్లో ఏర్పాటు చేశారు. బ్లూటూత్, వై-ఫై, హెచ్‌డీ‌ఎమ్ఐ వంటి కెనెక్టువిటీ వ్యవస్థలు సమచారాన్ని మరింత వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి.

మైక్రో SD మరియు మైక్రో SHDC వ్యవస్థల సౌలభ్యతతో మెమరీని వృద్ధి చేసుకోవచ్చు. త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ గ్యాడ్జెట్ ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot