అసూస్ కొత్త టాబ్లెట్ ‘వివో టాబ్’

By Prashanth
|

అసూస్ కొత్త టాబ్లెట్ ‘వివో టాబ్’

 

తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం అసూస్ (ASUS), గత నెలలో తన ‘వివోటాబ్ టాబ్లెట్ సిరీస్’ను ప్రకటించిన విషయం తెలిసిందే.  తాజాగా ఈ సిరీస్ నుంచి వివో ట్యాబ్ పేరుతో 11.6 అంగుళాల టాబ్లెట్‌ను విడుదల చేసింది. ‘ఎక్స్86’ ఆటమ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆధారితంగా డివైజ్ స్పందిస్తుంది. మైక్రోసాఫ్ట్ విండోస్8 ఆపరేటింగ్ సిస్టంను లోడ్ చేశారు.

డివైజ్ కీలక ఫీచర్లు....

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

ఆటమ్ జడ్2670 డ్యూయల్ కోర్ ప్రాసెసింగ్ యూనిట్ (క్లాక్ వేగం 1.8గిగాహెడ్జ్),

11.6అంగుళాల ఐపీఎస్+ ప్యానల్, ఉన్నతమైన బ్రైట్ నెస్, కార్నింగ్ ఫిట్ గ్లాస్ ప్రొటెక్షన్, యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్,

మల్టీ టచ్ డిస్ ప్లే, రిసల్యూషన్ 1,366 x 768పిక్సల్స్, ట్రూవివిడ్ టెక్నాలజీ,

8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,

సోనిక్ మాస్టర్ టెక్నాలజీతో కూడిన నాలుగు స్పీకర్టు,

విండోస్ స్టోర్ అప్లికేషన్స్,

వాకోమ్ డిజిటైజర్ స్టైలస్,

విండోస్ స్టోర్ అప్లికేషన్స్,

విండోస్ 8 ఆధారిత వివోట్యాబ్ ధర $799 (రూ.44,000).

అసూస్ ఈ టాబ్లెట్ ను విత్ మొబైల్ డాక్ తో, విత్ అవుట్ మొబైల్ డాక్ ఆప్షన్ తో విక్రయిస్తోంది.

డ్యూయల్ స్ర్కీన్ సామర్ధ్యంతో ‘అసూస్ టైచీ’!

టెక్ కన్స్యూమర్ బ్రాండ్ అసూస్, డ్యూయల్ స్ర్కీన్ సామర్ధ్యం కలిగిన స్లీక్ ఇంకా స్టైలిష్ అల్ట్రాబుక్‌ను ఇటీవల విడుదల చేసింది. పేరు ‘అసూస్ టైచీ’.ఈ డివైజ్‌ను అవసరమైతే నోట్‌ప్యాడ్‌గానూ, అవసరం లేనపుడు కీబోర్డ్‌ను తొలగించి ట్యాబ్లెట్‌గాను వాడుకోవచ్చు. ధర రూ.1,39,999.

స్పెసిఫికేషన్‌లు:

13.1 అంగుళాల స్ర్కీన్, విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఇంటెల్ కోర్ ప్రాసెసర్, డ్యూయల్- డిస్ ప్లే డిజైన్, హైడెఫినిషన్ స్ర్కీన్స్, 3మిల్లీ మీటర్ల మందం, డివైజ్ ను మల్టీ టచ్ టాబ్లెట్ ఇంకా మల్టీ టచ్ అల్ట్రాబుక్ లా ఉపయోగించు కోవచ్చు, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, ఇంటెల్ హైడెఫినిషన్ 4000 గ్రాఫిక్స్, ఎస్ఎస్ డి స్టోరేజ్ 128జీబి లేదా 256జీబి, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 720పిక్సల్ హైడెఫినిషన్ వీడియో కెమెరా, క్రిస్టల్ క్లియర్ వీడియో చాట్, ఉత్తమ క్వాలిటీ సౌండ్ లను ఉత్పత్తి చేసే క్రమంలో అసూస్ సోనిక్ మాస్టర్ టెక్నాలజీని డివైజ్ లో నిక్షిప్తం చేశారు. డ్యూయల్ బ్యాండ్ వై-ఫై విత్ ఇంటెల్ వై-ఫై, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 3.0 పోర్ట్స్, 5గంటల బ్యాటరీ లైఫ్, బరువు 1.25కిలో గ్రాములు.

Read In English

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X