అసూస్ టైచీ.. ఒకే గ్యాడ్జెట్ రెండు స్ర్కీన్‌లు!

Posted By: Staff

అసూస్ టైచీ.. ఒకే గ్యాడ్జెట్ రెండు స్ర్కీన్‌లు!

 

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ కన్స్యూమర్ బ్రాండ్ అసూస్, డ్యూయల్ స్ర్కీన్ సామర్ధ్యం కలిగిన స్లీక్ ఇంకా స్టైలిష్ అల్ట్రాబుక్‌ను బుధవారం ఢిల్లీలో విడుదల చేసింది. పేరు ‘అసూస్ టైచీ’.ఈ డివైజ్‌ను అవసరమైతే నోట్‌ప్యాడ్‌గానూ, అవసరం లేనపుడు కీబోర్డ్‌ను తొలగించి ట్యాబ్లెట్‌గాను వాడుకోవచ్చు. ధర రూ.1,39,999. ఈ కార్యక్రమంలో భాగంగా  వివో ట్యాబ్ , వివో బుక్ ఎఫ్202ఈ, వివోబుక్ ఎస్ 400లను అసూస్ వర్గాలు విడుదల చసాయి.

పీచర్లేంటి..?

13.1 అంగుళాల స్ర్కీన్,

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

శక్తివంతమైన ఇంటెల్ కోర్ ప్రాసెసర్,

డ్యూయల్- డిస్ ప్లే డిజైన్,

హైడెఫినిషన్ స్ర్కీన్స్,

3మిల్లీ మీటర్ల మందం,

డివైజ్ ను మల్టీ టచ్ టాబ్లెట్ ఇంకా మల్టీ టచ్ అల్ట్రాబుక్ లా ఉపయోగించు కోవచ్చు,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

ఇంటెల్ హైడెఫినిషన్ 4000 గ్రాఫిక్స్,

ఎస్ఎస్ డి స్టోరేజ్ 128జీబి లేదా 256జీబి,

5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా,

1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,

720పిక్సల్ హైడెఫినిషన్ వీడియో కెమెరా,

క్రిస్టల్ క్లియర్ వీడియో చాట్,

ఉత్తమ క్వాలిటీ సౌండ్ లను ఉత్పత్తి చేసే క్రమంలో  అసూస్ సోనిక్ మాస్టర్ టెక్నాలజీని డివైజ్ లో నిక్షిప్తం చేశారు.

డ్యూయల్ బ్యాండ్ వై-ఫై విత్  ఇంటెల్ వై-ఫై,

బ్లూటూత్ 4.0,

యూఎస్బీ 3.0 పోర్ట్స్,

5గంటల బ్యాటరీ లైఫ్,

బరువు 1.25కిలో గ్రాములు.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot