‘అసస్ టఫ్’.. ఈ టాబ్లెట్ చాలా హాట్ గురూ!!

ఈ టాబ్లెట్ పీసీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫీచర్లను మీరు పరిశీలిస్తే అదరహో అనాల్సిందే. ధృడమైన వ్యవస్థతో రూపొందించబడిన 7 అంగుళాల ‘అసస్’ టాబ్లెట్ పీసీని, నీటిలో ముంచినా ఏటువంటి ప్రమాదం ఉండదు. టాబ్లెట్ డిస్ ప్లే భాగంలో ఏర్పాటు చేసిన ‘డస్ట్ రెసిస్టెంట్’, దుమ్ము, ధూళి నుంచి సంరక్షిస్తుంది. యాధృచ్ఛికంగా సంభవించే విద్యుత్ షాక్, తదితర ప్రమాదర వైబ్రేషన్లను ఈ ధృడమైన టాబ్లెట్ తట్టుకోగలదు.
ఇక ఫీచర్లను పరిశీలిస్తే, గూగుల్ ఆండ్రాయిడ్ హనీకూంబ్ 3.2 ఆపరేటింగ్ వ్యవస్ధ ఆధారితంగా ఈ టాబ్లెట్ పీసీ పనిచేస్తుంది. డ్యూయల్ కోర్ 1GHz NVIDIA టెగ్రా 2 ప్రొసెసర్‌ను టాబ్లెట్‌లో అనుసంధానించారు. ఈ గ్యాడ్జెట్ స్టోరేజి సామర్ధ్యం 16జీబీ. ఇంకా మెమరీ కావాలనుకున్నవారు ఎక్సప్యాండబుల్ మెమరీ ఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా వృద్ధి చేసుకోవచ్చు. ఆధునిక బ్లూటూత్, వై - ఫై ఆప్లికేషన్లు సమాచార వ్యవస్థను మరింత పటిష్టతం చేస్తాయి.
7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. ఈ ఏడాది చివరిలో విడుదల కానున్న ఈ టాబ్లెట్ పీసీకి సంబంధించిన ధర విషయం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications