‘ముద్దు’గా ముస్తాభవుతుంది..!!

Posted By: Staff

‘ముద్దు’గా ముస్తాభవుతుంది..!!

మల్టీ స్పెషాలటీ సౌలభ్యతతో కొన్ని నెలల క్రితం వార్తల్లోకి ఎక్కిన ‘అసస్ ట్రాన్స్‌ఫార్మర్ టాబ్లెట్’, మళ్లి వార్తల్లోకి ఎక్కింది.. ఈ సారి విశేషమేమిటంటే సరికొత్త ‘న్విడియా టెగ్రా ప్రొసెసర్ వ్యవస్థ’తో ‘అసస్ ట్రాన్స్‌ఫార్మర్ 2’ టాబ్లెట్ పీసీ మార్కెట్లో విడుదల కానుంది.

‘అసస్ ట్రాన్స్‌ఫార్మర్’ టాబ్లెట్‌తో పోలిస్తే రానున్న ‘ట్రాన్స్‌ఫార్మర్ - 2’ వేగవంతమైన పనితీరు కలిగి ఉంటుందని తయారీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇంటెల్ కోర్ 2 డ్యూయో ప్రొసెసర్‌తో పోలిస్తే అధునాతన వ్యవస్థతో రూపుదిద్దుకున్న న్విడియా టెగ్రా ప్రొసెసర్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.

అపడేట్ కాబడుతున్న ‘ట్రాన్స్ ఫార్మర్ - 2’లో మరిన్ని ఫీచర్లైన 10.1 అంగుళాల ఎల్ఇడి బ్యాక్ లిట్ స్క్రీన్, మల్టీ టచ్ ‘ఇన్ పుట్’ వంటి అంశాలను పొందుపరిచారు. సరికొత్త టాబ్లెట్‌లో పొందుపరిచిన 5 మోగాపిక్సల్ కెమెరా వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తుంది. ఈ టాబ్లెట్లో ఏర్పాటు చేసిన 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో వీడియో కాలింగ్ చేసుకోవచ్చు.

ఎక్సటర్నల్ మెమరీని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.3జీ సామర్ధ్యం కలిగిన ‘అసస్’ మల్టీ టాస్కింగ్ అప్లికేషన్లతో పాటు స్పెషల్ అప్లికేషన్లను ఈ సరికొత్త పీసీలో పొందుపరిచారు.
మైలైబ్రరీ, కిండ్లీ, జినియో మ్యాగజైన్, అసస్ సింక్ వంటి అప్లికేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పవర్ మేనేజిమెంట్ విషయానికి వస్తే 24.4Wh లై - పాలీమర్ బ్యాటరీ 16 గంటలు పాటు నిరంతర శక్తి కలిగి ఉంటుంది.

ఇక మల్టీ స్పెషాలిటీ విధానానికి సంబంధించి మాట్లాడితే క్వర్టీ కీబోర్డును అవసరాన్నిబట్టి ‘టచ్ ప్యాడ్’కు అనుసంధానం చేసుకోవచ్చు. ‘ట్రాన్స్ ఫార్మర్ - 2’కు కలిగి ఉన్న 10 అంగుళాల వెడల్పు స్క్రీన్ ద్వారా నాణ్యమైన అనుభూతితో సినిమాలను వీక్షించవచ్చు. త్వరలో విడుదల కానున్న ఈ వర్షన్ ధర భారతీయ మార్కెట్లో రూ. 18,200 ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot