ఆన్‌లైన్‌‌లో ఆ వీడియో టేప్..?

Posted By: Prashanth

ఆన్‌లైన్‌‌లో ఆ వీడియో టేప్..?

 

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాలు నిర్మాణ సంస్థ అసస్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన టాబ్లెట్ ‘అసస్ ట్రాన్స్‌ఫార్మర్ ప్యాడ్ ఇన్ఫినిటీ’. ఈ సొగసరి కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌కు సంబంధించిన ఓ అధికారిక వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో లీకైంది. వివరాల్లోకి వెళితే.. మొదటి సారిగా ఈ డివైజ్‌ను ఫిబ్రవరి 2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించారు. గ్యాడ్జెట్ విడుదల జూన్‌లో ఉంటుందని అసస్ వర్గాలు ప్రకటించిన నేపధ్యంలో ఈ వీడియో లీక్ మరింత ఉత్కంఠను పెంచుతోంది.

Read In English

అసస్ ట్రాన్స్‌ఫార్మర్ ప్యాడ్ ఇన్‌ఫినిటీ కీలక ఫీచర్లు:

10.1 అంగుళాల హై డెఫినిషన్ గొరిల్లా గ్లాస్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 * 1200 పిక్సల్స్), ఐపీఎస్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్నడిస్‌ప్లే టెన్ పాయింట్ ఫింగర్ టచ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ఎన్-విడియా టెగ్రా3 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, అసస్ వెబ్ స్టోరేజ్ ద్వారా 8జీబీ ఫ్రీ స్టోరేజ్ స్పేస్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot