‘అసస్’ కాదు అదుర్స్...!!

Posted By: Staff

‘అసస్’ కాదు అదుర్స్...!!

తీగ లాగిదే డొంకంతా బయటపడినట్లు..యాపిల్ ప్రవేశపెట్టన ‘ఐపాడ్’ కాస్తా టాబ్లెట్‌‌గా రూపాంతరం చెంది ప్రస్తుత కంప్యూటింగ్ వ్యవస్థనే శాసిస్తుంది. ఈ టాబ్లెట్ల తయారీలో రోజు రోజుకు వస్తున్న మార్పులు దిమ్మ తిరిగే టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ‘అసస్’ టెక్నాలజీ ప్రవేశపెట్టిన ‘టూ ఇన్ వన్ కాన్సెప్ట్’ అభివృద్ధి చెందిన సాంకేతికతకు అద్దం పడుతోంది.

‘Asus EEE Pad Transformer TF101’ పేరులో ‘అసస్’ టెక్నాలజీ ఓ ‘2 in 1’పరికారాన్ని విడుదల చేసింది. ఈ పరికరాన్ని ‘ అటు నోటుబుక్ లా... ఇటూ టాబ్లెట్లా’ ఉపయోగించుకోవచ్చు. అంటే టాబ్లెట్, కీ ప్యాడ్ భాగాలాను వేరుచేసుకుని ఉపయోగించుకునే కొత్త విధానాన్ని ‘అసస్’ టెక్నాలజీ ప్రవేశ పెట్టింది. అధునాతన ఫీచర్లతో పాటు 2 in 1 సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ‘Asus EEE Pad Transformer TF101’ ఇతర టాబ్లెట్ కంపెనీలతో పోటీ పడే సత్తా కలిగి ఉంది. Android honeycomb 3.0 ఆపరేటింగ్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న TF101, NVIDIA Tetra 2 dual core processor కలిగి ఉండటంతో మల్టీ మీడియా, వెబ్ బ్రౌసింగ్ వంటి అంశాలు అత్యంత వేగవంతగా పనిచేస్తాయి.

ఇక TF101 డిస్ ప్లే విషయానికి వస్తే 10.1 అంగుళాలు కలిగి ఉండటంతో పాటు 1280 X 800 పిక్సల్స్ రిసల్యూషన్‌తో పని చేస్తుంది. సరికొత్త మోడలింగ్‌తో ‘అసస్ TF101’ ప్రస్తుత టాబ్లెట్ మార్కెట్లో తన హవాను కొనసాగిస్తుంది కీప్యాడ్ నుంచి వేరు చేసిన టాబ్లెట్‌ను కెమెరాలా ఉపయోగించుకోవచ్చు. 5 మోగా పిక్సల్ సామర్థ్యం కలిగిన రేర్ (వెనుక) కెమెరా నాణ్యమైన ఫోటోలను మీకు అందిస్తుంది. అంతేకాకుండా మధుర జ్ఞాపకాలను, నాణ్యమైన వీడియో రూపంలో ఈ టాబ్లెట్ లో బంధించుకోవచ్చు. 1.2 మోగా పిక్సల్ సామర్థ్యం కలిగిన ఫ్రంట్ కెమెరా, నాణ్యమైన వీడియో ఛాటింగ్ అనుభూతిని మీకు అందిస్తుంది.

ఇక మెమరీ విషయానికి వస్తే TF101 మెమరీ శాతాన్ని 16 నుంచి 32 GBకి మెమరీ పోర్ట్ ద్వారా పెంచుకోవచ్చు.TF101కి అమర్చిన వేగవంతమైన వై - ఫై, శక్తివంతమైన బ్లూటూత్ వ్యవస్థలు చురుకుగా పనిచేస్తూ మీ సమయాన్ని మరింత ఆదా చేస్తాయి. ఈ 2 in 1 పరికరంలో అదనంగా పొందుపరిచిన ‘పొలారీస్ ఆఫీస్ 3.0’ వ్యవస్థ ఆఫీషియల్ డాక్యుమెంట్ల తయారు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 24.4 watt-hours సామర్థ్యం కలిగి ఉంది. ఇన్ని సౌలభ్యాలున్న ‘Asus EEE Pad Transformer TF101’ను మీ సహాయకునిగా ఎంచుకోండి, ధర కేవలం రూ.32,999 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot