‘అసస్’ ప్రపంచ శ్రేణి ‘నోట్ బుక్’త్వరలో.!

Posted By: Staff

‘అసస్’ ప్రపంచ శ్రేణి ‘నోట్ బుక్’త్వరలో.!

‘‘మరో సాంకేతిక విప్లవం భారతీయ గడ్డపై రాజుకోనుందా..?, కంప్యూటింగ్ పరికరాలు మానవుని దైనందిన జీవితాల్లో నిత్యావసరంలా మారాయా..?, సాంకేతిక పరిశ్రమలో దూసుకుపోతున్న ‘అసస్’మరో ప్రభంజనం సృష్టించబోతుందా..?,’’

అవును.., ప్రస్తుత టెక్ యుగంలో కంప్యూంటిగ్ వ్యవస్థ మానవుని నిత్య కార్యకలపాల్లో కీలక పాత్రపోషిస్తుంది., సాంకేతికతలో చోటుచేసుకుంటున్న నూతన సమీకరణలు సరికత్త విప్లవానికి నాందిపలుకుతున్నాయి. సాంకేతిక వస్తు ప్రపంచంలో మధ్యతరగతి కంఫర్ట్ బ్రాండ్ గా గుర్తింపుపొందిన ‘అసస్’మరో నూతన ఆవిష్కరణకు నాంది పలకనుంది.

ప్రముఖ కంప్యూటర్ పరికరాల తయారీదారు ‘అసస్’అత్యాధునిక సాంకేతికతో రూపొందించబడిన ప్రపంచ అత్యుత్తమ్ ‘నోట్ బుక్’ పరికరాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.
‘Asus U36SD’ వర్షన్లో విడుదలవుతన్న గ్యాడ్జెట్ ఫీచర్లు క్లుప్తంగా.

- ల్యాపీ బరువు 1.3 కేజీలు.

- శక్తివంతమైన న్విడియా ఆప్టిమస్ టెక్నాలజీని గ్యాడ్జెట్లో ఏర్పాటు చేశారు.

- విండోస్ జన్యున్ 7 ఆపరేటింగ్ వ్యవస్థను పరికరంలో లోడ్ చేశారు.

- ఇంటెల్ కోర్ i7 2620M ప్రాసెసర్ వేగవంతమైన పనితీరు కలిగి ఉంటుంది.

- 13.3 అంగుళాల స్క్రీన్ డిస్ ప్లే, 16:9 హై డెఫినిషన్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.

- ఏర్పాటు చేసిన 4 సెల్ బ్యాటరీ వ్యవస్థ 10 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- బ్యాటరీకి సంవత్సరం వారంటీ, ఇతర హార్డ్ వేర్ పరికరాలను రెండు సంవత్సరాల వారంటీ.

- ల్యాప్ టాప్ ప్యానల్ కు ఒక నెల సర్వీసింగ్ ఉచితం.

- భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న ‘అసస్ U36’ ధరూ రూ.31,500.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting