యువతను మెప్పించే ‘అసస్ అల్ట్రాబుక్స్’ త్వరలో...!!

Posted By: Super

యువతను మెప్పించే ‘అసస్ అల్ట్రాబుక్స్’ త్వరలో...!!

నిన్న మొన్నటి వరకు ల్యాప్‌టాప్, టాబ్లెట్ పీసీల తయారీ పై దృష్టి కేంద్రీకరించిన గ్యాడ్జెట్ బ్రాండ్లు ఇప్పుడు అల్ట్రాబుక్ పరికరాల పై దృష్టిసారిస్తున్నాయి. ఈ కోవలోనే అసస్ ‘UX21’, ‘UX31’ పేర్లతో సరికొత్త అల్ట్రాబుక్ పరికరాలను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. గ్యాడ్జెట్లు సెప్టంబర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

విడుదల కాబోతున్న ఈ అల్ట్రాబుక్ పరికరాల ఫీచర్లను పరిశీలిస్తే , 11.6 అంగుళాల స్వచ్ఛమైన ఆల్యూమినియంతో ఈ గ్యాడ్జెట్లను తీర్చిదిద్దారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరుకు ఈ పరికరాల్లో సెంకడ జనరేషన్ ఇంటెల్ కోర్ i5, i7 ప్రొసెసర్లతో పాటు DDR3 మెమరీ వ్యవస్థను పొందుపరిచినట్లు తెలుస్తోంది. లైటర్ డిజైన్‌తో రూపొందించిన ఈ పరికరాల బరవు 1 కేజీలోపు ఉండోచ్చని సమాచార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ డివైజుల్లో పొందుపరిచిన 16 లేకు 128 GB SSD, యూఎస్బీ 3.0 వంటి అంశాలు హార్డ్‌వేర్ వ్యవస్థను మరింత పటిష్ట స్థాయికి చేరుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అన్ని వర్గాల ప్రజలకు ఈ అసస్ అల్ట్రాబుక్‌లు అందుబాటులో ఉండే విధంగా రూ.45,000కు ఈ పరికరాన్నిఅందించనున్నట్లు తెలుస్తోంది. యువతకు ఉపయోగపడే అన్ని అంశాలను ఈ డివైజుల్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot