అబ్బా!! రెండు వైపులా అదుర్స్?

Posted By: Prashanth

అబ్బా!! రెండు వైపులా అదుర్స్?

 

ఒకే డివైజ్‌ను ఒకే సమయంలో రెండు విధాలుగా ఉపయోగించుకునేలా అసస్ తన ప్రతిభకు సాన పెట్టింది. ఈ బ్రాండ్ తాజాగా రూపొందించిన ‘2-in-1 హైబ్రీడ్ టైచీ’ని, ల్యాప్‌టాప్ అదేవిధంగా టాబ్లెట్ కంప్యూటర్లా ఉపయోగించుకోవచ్చు. గ్యాడ్జెట్ ముందు వెనుక భాగాల్లో డిస్‌ప్లే స్ర్కీన్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకదాని పరిమాణం 11.6 అంగుళాలు కాగా రెండవదాని పరిమాణం 13.3 అంగుళాలు, 1900 x 1280పిక్సల్ రిస్యల్యూషన్ సామర్ధ్యం కలిగిన ఈ స్ర్కీన్‌లు ఉత్తమ క్వాలిటీతో కూడిన విజువల్ అనుభూతిని కలిగిస్తాయి. ఈ డివైజ్ నోట్‌బుక్ మోడ్‌లో ఉన్నప్పుడు ట్రాక్‌ప్యాడ్ అదేవిధంగా బ్యాక్‌లిట్ క్వర్టీ కీబోర్డ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. లిడ్‌ను మూసివేసిన తరువాత పరికరం పూర్తి స్థాయి టాబ్లెట్ కంప్యూటర్లా మారిపోతుంది.

ఇంటెల్ ఐవీ బ్రిడ్జ్ కోర్ ఐ7 ప్రాసెసర్‌ను ఈ కంప్యూటింగ్ పరికరంలో నిక్షిప్తం చేశారు. ఈ చర్యతో వేగవంతమైన ప్రాసెసింగ్‌ను యూజర్ ఆశించవచ్చు. 4గిగ్స్ సామర్ధ్యం గల ర్యామ్ సిస్టం పనితీరును వేగిరితం చేస్తుంది. సెకండరీ స్టోరేజ్ కింద ఎస్ఎస్‌డి స్టోరేజ్ వ్యవస్థను ‘హైబ్రీడ్ టైచీ’లో ఏర్పాటుచేశారు. ఉత్తమమైన ఫోటోగ్రఫీ విలువలతో కూడిన రెండు కెమెరాలను అమర్చారు. డ్యూయల్ బ్యాండ్ 802.11n వై-ఫై కనెక్టువిటీ సాయంతో డివైజ్‌ను వైర్ల సాయం లేకుండా కనెక్ట్ చేసుకోవచ్చు. ధర ఇతర విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.

గుగూల్, అసస్ ల ఒప్పందం!

సొంత బ్రాండెడ్ హార్డ్‌వేర్ వ్యవస్థతో స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేసి ఆ విభాగంలో తన సత్తాను చాటుకున్న గుగూల్, టాబ్లెట్ కంప్యూటర్‌ల సెక్టార్‌లోనూ పైచేయి సాధించేందుకు సన్నాహాలు చేస్తోంది. అసస్‌తో జత కట్టి ఆధునిక ఫీచర్లతో సుసంపన్నమైన టాబ్లెట్ కంప్యూటర్‌ను గుగూల్ ఇటీవల రూపొందించింది. ఈ డివైజ్ మార్కెట్ విడుదలకు సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూలై 2012 నుంచి గుగూల్ టాబ్టెట్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయని ప్రముఖంగా వార్తలు వినబడుతున్నాయి. తొలత ఈ టాబ్లెట్‌ను మేలో అందుబాటులోకి తేవాలని గుగూల్ నిశ్చయించుకుంది. పలు సాంకేతిక లోపాల కారణంగా విడుదలను వాయిదా వేసుకుంది. అసస్ డిజైన్ చేసిన గుగూల్ నెక్సస్ టాబ్లెట్ ధర అంచనా రూ. 13,000 . డివైజ్ ప్రధాన ఫీచర్లను పరిగణలోకి తీసుకుంటే…

* 7 అంగుళాల టచ్ స్ర్కీన్,

* ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* టెగ్రా 3 ప్రాసెసర్,

* వై-ఫై కనెక్టువిటీ,

రెండు బలమైన కంపెనీల సమన్వయంతో రూపుదిద్దుకుంటున్న ఈ హై ఎండ్ కంప్యూటింగ్ డివైజ్ వినియోగదారుడికి మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. ఇప్పటికే పలు దేశాల కంప్యూటింగ్ మార్కెట్లలో హాట్ కేకులా అమ్ముడవుతున్న ఆమోజన్ కిండిల్ ఫైర్ టాబ్లెట్ పీసీకి, గుగూల్ నెక్సస్ పోటీగా నిలవనుందని పరిశీలకల అంచనా. సామన్య, మధ్య తరగతి వినియోగదారులకు సైతం ఈ టాబ్లెట్‌ను అందుబాటులో ఉంచేందకు తక్కువ ధరకే వీటిని విక్రయించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచరం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot