ఫస్ట్‌లుక్‌లోనే మీరు ఫ్లాటవ్వకతప్పదు..!!

Posted By: Super

ఫస్ట్‌లుక్‌లోనే మీరు ఫ్లాటవ్వకతప్పదు..!!

మనసుకు నచ్చిన వస్తువులను కోనుగోలు చేయటంలో మన వాళ్లు ముందుంటారు. అంతేకాదు.. తొలి చూపులోనే ఆ వస్తువు పై మనసు పారేసుకుంటే పోటి పడి మరి ఎంత ధరైనా వెచ్చించి ఆ వస్తువును వసం చేసుకోవటం కొందరికి హాబీ. అయితే ఓ సంస్థ ప్రవేశపెట్టిన ఓ సాంకేతిక పరికరం చూసే వారి మనసులను తొలి చూపులోనే క్లీన్ బౌల్డ్ చేసిందట.

‘అసస్ టెక్నాలజీస్’.. సాంకేతిక ప్రియులకు సుపరిచితమైన పేరు.. ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌లు, నోట్‌బుక్‌లు ప్రవేశపెట్టిన ఈ ఫైర్ బ్రాండ్ అమ్మకాలలోను తన వాటాలను పదిల పర్చుకుంది. తాజాగా బెంగుళూరులో జరిగిన సంస్థ కార్యక్రమంలో ‘అసస్’ X 101 సరికొత్త నెట్‌బుక్‌ను విడుదల చేసింది.

17.6 మిల్లీ మీటర్ల దారుఢ్యం కలిగిన ఈ నెట్‌బుక్ బరువును పరిశీలిస్తే 1కేజీ మాత్రమే. మొబైల్ కంప్యూటింగ్‌ను ఇష్టపడే వినియోగదారులకు నెట్‌బుక్ మరింత ఉపయోగపడుతుంది. తక్కవ సైజుతో పాటు అతితక్కువ బరువు కలిగి ఉన్న ఈ నెట్ ఏ ఇతర ల్యాప్‌టాప్‌లో లేనన్ని ఫీచర్లను కలిగి ఉంది.

అసస్ ‘X101’ లోని ఇంతర అంశాలను పరిశీలిస్తే 10.1 అంగుళాల మానిటర్ డిస్‌ప్లేను ఆకర్షణీయంగా రూపొందించారు. బ్లూటూత్ 3.0 వర్షన్‌ను ఒదిగి ఉన్న ఈ నెట్‌బుక్ ఫైల్స్ ట్రాన్స్‌ఫరింగ్ విషయంలో వేగవంతంగా పనిచేస్తుంది. అనుసంధానించబడిన కీబోర్డు వినియోగదారునికి సౌకర్యవంతంగా స్పందిస్తుంది.

నెట్‌బుక్‌లో పొందుపరిచిన సూపర్ హైబ్రీడ్ ఇంజన్ ప్రొసెస్సర్ అత్యుత్తమ సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ నెట్‌బుక్‌లో పొందుపరిచిన బ్యాటరీ సుదీర్ఘ కాలపరిమాణం కలిగి ఉంటుంది. ఈ నెట్‌బుక్‌లో ముందుగానే లోడ్ చేసిన సోషల్ నెట్‌వర్కింగ్ మరియు విద్యావ్యవస్ధకు సంబంధించిన పలు ఆప్లికేషన్లు వినియోగదారునికి సమాజా తాజా స్థితిగతులను మరింత దగ్గర చేస్తాయి.

అసస్ ‘X101’ విడుదలకు సంబంధిచి బెంగుళూరులులో జరిగిన ఓ కార్యక్రమంలో అసస్ టెక్నాలజీస్, ఇండియా అధిపతి అలెక్స్ హువాంగ్ మాట్లాడుతూ వినియోగదారుని ప్రస్తుత జీవన శైలిని దృష్టిలో ఉంచుకుని ‘అసస్’ నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుందని, ఈ క్రమంలోనే ‘X101’ నెట్‌బుక్‌ విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ నెట్‌బుక్ మార్కెట్ ధరను పరిశీలిస్తే రూ.12,499 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot