18 గంటల బ్యాటరీ లైఫ్, 1.4kg బరువు, 13th Gen ఇంటెల్.. ASUS వివోబుక్ S14, S14 ఫ్లిప్ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్..
ASUS Vivobook S14 and S14 Flip Launched : అసూస్ (ASUS) ఇండియాలో రెండు సరికొత్త, స్టైలిష్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. అవే వివోబుక్ S14 (S3407VA), వివోబుక్ S14 ఫ్లిప్ (TP3402VAO). ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్, విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో పెట్టుకుని ఈ 14-అంగుళాల ల్యాప్‌టాప్‌లు రూపొందించారు. ఇవి తేలికగా తీసుకువెళ్లడానికి వీలుగా, శక్తివంతమైన పనితీరుతో, వాడుకలో సౌలభ్యంగా ఉంటాయి.
లేటెస్ట్ 13వ తరం ఇంటెల్ H-సిరీస్ ప్రాసెసర్లు, స్మార్ట్ AI ఫీచర్లు, దృఢమైన డిజైన్‌తో వస్తున్న ఈ రెండు మోడల్స్, ఆధునిక జీవనశైలికి అవసరమైన అన్ని పనులను చక్కబెట్టగలవని కంపెనీ చెబుతోంది. మరి వీటి ఫీచర్లు, ధర వివరాలు, ఇంకా ముఖ్యమైన అన్ని విషయాలు తెలుసుకుందాం పదండి.

* వివోబుక్ S14
వివోబుక్ S14 ల్యాప్‌టాప్‌లో శక్తివంతమైన ఇంటెల్ కోర్ i7-13620H ప్రాసెసర్ ఉంది. దీని బరువు కేవలం 1.4 కేజీలు మాత్రమే. అలాగే, ఇది కేవలం 1.59 సెం.మీ. మందంతో చాలా సన్నగా, ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లేలా ఉంటుంది. ఇందులో పెద్ద 70WHr బ్యాటరీ అమర్చారు, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 18 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ అంటోంది.
అంటే రోజంతా ఆఫీస్ పని లేదా కాలేజీ వర్క్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ MIL-STD 810H మిలిటరీ ప్రమాణాలకు తగ్గ మన్నికను కలిగి ఉంది. మెటల్ బాడీ, దానిపై CNC మెషిన్‌తో చెక్కిన లోగో దీనికి ప్రీమియం లుక్‌ని ఇస్తున్నాయి. దీని 14-అంగుళాల FHD+ డిస్ప్లే 16:10 యాస్పెక్ట్ రేషియోతో, 86% స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది.
దీనివల్ల చిన్న సైజులోనే పెద్ద స్క్రీన్ అనుభూతి కలుగుతుంది. దీని ఎర్గోసెన్స్ టచ్‌ప్యాడ్ స్మార్ట్ జెశ్చర్లకు సపోర్ట్ చేస్తుంది, దీని ద్వారా స్క్రీన్ బ్రైట్‌నెస్, వాల్యూమ్ వంటివి సులభంగా కంట్రోల్ చేయవచ్చు. బ్యాక్‌లిట్ కీబోర్డ్‌లో విండోస్ AI టూల్స్‌ను ఒకే ట్యాప్‌తో యాక్సెస్ చేయడానికి ప్రత్యేకంగా 'కోపైలట్ కీ' కూడా ఇచ్చారు.
విండోస్ హలో ద్వారా సురక్షితంగా లాగిన్ అవ్వడానికి ఫుల్ HD IR కెమెరా ఉంది, దీనికి ప్రైవసీ షట్టర్ కూడా అమర్చారు. ఎక్కువ సేపు వాడినా ల్యాప్‌టాప్ వేడెక్కకుండా స్థిరమైన పనితీరును అందించడానికి అసూస్ ఐస్‌కూల్ థర్మల్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్లు ఇచ్చారు.
* వివోబుక్ S14 ఫ్లిప్
వివోబుక్ S14 ఫ్లిప్ 360-డిగ్రీల హింజ్ (కీలు)తో వస్తుంది. దీనివల్ల దీన్ని ల్యాప్‌టాప్‌లా, టాబ్లెట్‌లా, టెంట్‌లా లేదా స్టాండ్ మోడ్‌లో ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. దీని బరువు 1.5 కేజీలు. మెటాలిక్ మూత దీనికి మరింత ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. S14 లాగానే ఇదీ MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ మన్నికతో వస్తుంది.
ఈ మోడల్‌లో ఇంటెల్ కోర్ i5-13420H ప్రాసెసర్, 16GB ఆన్‌బోర్డ్ ర్యామ్ ఉన్నాయి. అవసరమైతే SO-DIMM స్లాట్ ద్వారా ర్యామ్‌ను మరింత పెంచుకునే అవకాశం కూడా ఉంది. దీని 14-అంగుళాల FHD+ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే 16:10 యాస్పెక్ట్ రేషియో, 85% స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది.
ఇది స్టైలస్ పెన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది, కాబట్టి నోట్స్ రాసుకోవడానికి, డ్రాయింగ్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇందులో కూడా అసూస్ ఐస్‌కూల్ టెక్నాలజీ ఉంది. MyASUS యాప్‌లోని ఫ్యాన్ ప్రొఫైల్స్ ద్వారా పనితీరును కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. మల్టీమీడియా అనుభూతి కోసం, డాల్బీ అట్మాస్‌తో ట్యూన్ చేసిన హార్మాన్ కార్డాన్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
ప్రైవసీ షట్టర్‌తో కూడిన 1080p ఫుల్ HD వెబ్‌క్యామ్, బ్యాక్‌లిట్ ఎర్గోసెన్స్ కీబోర్డ్, కనెక్టివిటీ కోసం USB 3.2 Gen 2 Type-C, HDMI 2.1, Wi-Fi 6E వంటి అన్ని ముఖ్యమైన పోర్టులు, ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 50WHr బ్యాటరీ, వేగంగా ఛార్జ్ చేయడానికి 90W ఫాస్ట్ ఛార్జర్ కూడా బాక్స్‌తో పాటు వస్తాయి.
వివోబుక్ S14 (Vivobook S14) ధర విషయానికి వస్తే.. i5 మోడల్ ధర రూ.67,990 నుంచి ప్రారంభమవుతుంది. i7 మోడల్ ధర రూ.79,990 వరకు ఉంటుంది. ఇది అసూస్ ఇ-షాప్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
వివోబుక్ S14 ఫ్లిప్ (Vivobook S14 Flip) ధర రూ.69,990. ఇది అసూస్ ఇ-షాప్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఆన్‌లైన్‌లో, అలాగే ఆసుస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఇతర రిటైల్ దుకాణాలలో ఆఫ్‌లైన్‌లో కూడా లభిస్తుంది.


Click it and Unblock the Notifications