మార్కెట్లోకి ‘హ్యాండ్‌సమ్’ నోట్‌బుక్‌లొచ్చాయోచ్..!!

Posted By: Super

మార్కెట్లోకి  ‘హ్యాండ్‌సమ్’ నోట్‌బుక్‌లొచ్చాయోచ్..!!

నోట్‌బుక్ తయారీ సెక్టార్‌లో నూతన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వినియోగదారునికి మరింత సౌలభ్యం కలిగించేందుకు వీలుగా తక్కువు బరువు కలిగిన నోటు‌బుక్‌లను తయారుచేసేందుకు పలు బ్రాండ్లు ముక్కువు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ‘శ్యామ్‌సంగ్’, ‘అసస్’ బ్రాండ్లు తక్కువ బరవుతో రూపొందిచిన తమ నోట్‌బుక్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి.

శ్యామ్ సంగ్ ‘N-100’ పేరుతో 1.03 కేజీల బరువు గల సరికొత్త నోట్‌బుక్‌ను ప్రవేశపెట్టింది. అయితే శ్యామ్‌సంగ్‌కి ధీటుగా ‘అసస్’ బ్రాండ్ ‘X101’ పేరుతో కేవలం 920 గ్రాముల బరువు గల స్లిమ్ నోట్‌బుక్‌ను ఆకర్షీణీయమైన డిజైన్లలో రూపొందించి మర్కెట్లో విడుదలచేసింది. వీటి మధ్య వృత్యాసాన్ని పరిశీలిస్తే.. ‘అసస్ X101’తో పోలిస్తే, ‘శ్యామ్‌సంగ్ N-100’, శక్తివంతమైన వ్యవస్థతో రూపుదిద్దుకుంది. తక్కువ శక్తి వ్యయంతో, ఎక్కువ పని తీరు కలిగి ఉండే లక్ష్యంతో నోట్‌బుక్ ను తీర్చిదిద్దారు.

‘అసస్’ కూడా ఏ మాత్రం తీసిపోలేదు... ఈ నోట్‌బుక్‌లో పొందుపరిచిన సోషల్ నెట్ వర్కింగ్ సౌలభ్యత, మానవ సంబంధాలను ప్రస్తుత డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా తీర్చిదిద్దుతుంది. అంతేకాదు నోట్‌బుక్‌లో ముందుగానే లోడ్ చేసిన ‘ఇంగ్లీష్ లెర్నింగ్ ఆప్లికేషన్’ ఆంగ్ల పద సంపదను మరింత పెంచుతుంది. ఈ రెండింటిలో టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే.. మీగో (MeeGo) ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఇంటెల్ ఆటమ్ (Intel Atom) ప్రొసెస్సర్ సహకారంతో ఇవి పనిచేస్తాయి. ‘శ్యామ్‌సంగ్ N-100’లో పొందుపరిచిన ‘యాంటీ రిఫ్‌లెక్టివ్ స్ర్ర్కీన్’ ఆప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

కెమెరా అంశాలను పరిశీలిస్తే.. ఈ నోట్‌బుక్‌లతో ప్రత్యక్ష ఛాటింగ్ జరుపుకునేందుకు కెమెరాలనుఅమర్చారు. అయితే ‘అసస్ X101’లో పొందుపరిచిన 0.3 మెగా పిక్సల్ కెమెరా ఆడ్వాన్స్ వర్షన్ కలిగి ఉంది. ఆడియో విషయానికొస్తే.. ఈ రెండు నోట్‌బుక్‌లలో నాణ్యమైన స్పీకర్లతో పాటు, సామర్ధ్యం కలిగిన బ్యాటరీలను పొందుపరిచారు. వీటికి అనుసంధానించబడిన కీబోర్డు సౌకర్యవంతంగా పనిచేస్తుంది. చివరిగా వీటి ధర విషయానొకొస్తే.. ఈ రెండు మోడళ్లు ఇంచు మించుగా ఒకే ధరను కలిగి ఉన్నాయి. శ్యామ్‌సంగ్ N-100 ధర రూ.12,290 ఉండగా, ‘అసస్ X101’ ధర రూ.12,450 పలుకుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot