ఈ ల్యాప్‌టాప్ ఖరీదు అక్షరాలా 75,000..?

Posted By: Prashanth

ఈ ల్యాప్‌టాప్ ఖరీదు అక్షరాలా 75,000..?

 

హై క్వాలిటీ కంప్యూటింగ్ పరికరాలను డిజైన్ చేయ్యటంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న అసస్ (Asus)దృఢమైన ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. ‘అసస్ జెన్ బుక్ UX31E’ మోడల్‌లో విడుదలవుతున్న ఈ ల్యాపీ ధర రూ.75,000.

ల్యాపీ డిస్‌ప్లే సైజ్ 13.3 అంగుళాలు, రిసల్యూషన్ సామర్ధ్యం 1600 x 900 పిక్సల్స్. 64 బిట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది. వినియోగదారుడు ఎంపికను బట్టి ఇంటెల్ కోర్ i5 లేదా i7 ప్రాసెసర్లను నిక్షిప్తం చేస్తారు. హార్డ్ డ్రైవ్ సామర్ధ్యం 256 జీబి, 4జీబి 1333 MHz DDR3 ర్యామ్.

ఇంటర్నెట్ వ్యవస్థను కనెక్ట్ చేసే 802.11 b/ g/n వై-ఫై వ్యవస్థ, డేటాను వేగవంతంగా షేర్ చేసుకునేందుకు బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలను ల్యాపీలో నిక్షిప్తం చేశారు. హై డెఫినిషన్ వ్యవస్థలకు జత చేసుకునే విధంగా హెచ్డీఎమ్ఐ పోర్ట్. పొందుపరిచిన సోనిక్ మాస్టర్ ఆడియో టెక్నాలజీ హై క్వాలిటీ సౌండ్ అనుభూతులకు లోను చేస్తుంది. మన్నికైన పాలిమర్ బ్యాటరీ వ్యవస్థ పటిష్ట్ బ్యాకప్ నిస్తుంది. గ్యాడ్జెట్ బరువు 1.3 కిలోలు, ల్యాపీకి రెండు సంవత్సరాల వారంటీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting