డ్యూయల్ స్క్రీన్‌లతో ASUS ల్యాప్‌టాప్ విడుదల ఖరారు.. ముందస్తు బుకింగ్ ప్రారంభం.. రూ.20,398 వరకు ప్రయోజనాలు!
ఆసుస్ నుంచి కొత్త ల్యాప్‌టాప్ విడుదల కానుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ఆసుస్ జెన్‌బుక్ డుయో 2024 ను (Asus Zenbook Duo 2024) ప్రదర్శించారు. ఈ ల్యాప్‌టాప్‌లు వచ్చే వారం భారత్‌లో లాంచ్ కానుండగా.. ప్రస్తుతం ముందస్తు బుకింగ్ తేదీలను ప్రారంభించింది. ఈ ట్యాప్‌టాప్ డ్యూయల్ స్క్రీన్ 14 అంగుళాల పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ఆసుస్ జెన్‌బుక్ డుయో భారత్‌లో ఏప్రిల్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఏప్రిల్ 15 వరకు ముందస్తు బుకింగ్‌లను చేసుకోవచ్చు. ఆసుస్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ముందస్తు బుకింగ్ చేయడం ద్వారా రూ.20,398 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

దీంతోపాటు ఆసుస్ ప్రోఆర్ట్ మౌస్ (MD 300), మరియు రెండు సంవత్సరాలపాటు వారంటీ, మూడు సంవత్సరాలపాటు యాక్సిడెంటల్ డ్యామేజీ ప్రొటెక్షన్‌ను పొందవచ్చు. అయితే ఈ కొత్త ల్యాప్‌టాప్ ధరను ఆసుస్ సంస్థ వెల్లడించలేదు. అయితే intel core అల్ట్రా 5, 16GB ర్యామ్ మరియు 1TB వేరియంట్ ధర రూ.1,59,990 గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఆసుస్ జెన్‌బుక్ డుయో ల్యాప్‌టాప్ డ్యూయల్ స్క్రీన్ OLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. మరియు టచ్‌ప్యాడ్‌తో కూడిన వేరుచేసేందుకు అవకాశం ఉన్న కీబోర్డును (Detachable KeyBoard) కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్ OS పైన పనిచేస్తుంది.
ఆసుస్ జెన్‌బుక్ డుయో 2024 ల్యాప్‌టాప్ డ్యూయల్ 14 అంగుళాల పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 91 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో మరియు 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లేను 19.8 అంగుళాల వరకు పొడిగించవచ్చు. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్ సపోర్టుతో వస్తుంది.
ఈ ఆసుస్ జెన్‌బుక్ ఉయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత Intel Core అల్ట్రా 9 185H ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. గరిష్ఠంగా 32GB LPDDR5x ర్యామ్, 2TB PCle 4.0 SSD స్టోరేజీని కలిగి ఉంటుంది. వైఫై 6E మరియు బ్లూటూత్ 5.3 సహా 1080p వెబ్ కెమెరాను కలిగి ఉంటుంది.
సింగిల్ ఛార్జింగ్ ద్వారా 13 గంటలపాటు బ్యాకప్ :
ఈ ల్యాప్‌టాప్ 65W ఛార్జింగ్ సపోర్టుతో 75Whr బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ ద్వారా 13 గంటలపాటు వినియోగించుకోవచ్చు. 65W ఛార్జర్ ద్వారా 60 శాతం బ్యాటరీని కేవలం 49 నిమిషాల్లో ఛార్జింగ్ చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications