కొనసాగుతున్న లీకుల పరంపర?

Posted By: Prashanth

కొనసాగుతున్న లీకుల పరంపర?

 

అసస్ కొత్త శ్రేణి ల్యాప్‌టాప్ ‘జెన్‌బుక్ UX32VD’ ఫీచర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో బహిర్గతమైన స్పెసిఫికేషన్‍‌లు డివైజ్ ప్రాముఖ్యతను రెట్టింపు చేస్తున్నాయి. ప్రధానంగా ల్యాపీలో నిక్షిప్తం చేసిన కొత్త జనరేషన్ ప్రాసెసర్, హైడెఫినిషన్ స్ర్కీన్ అదేవిధంగా అత్యుత్తమ స్థాయి గ్రాఫిక్ వ్యవస్థలు యూజర్‌కు కొత్త తరహా కంప్యూటింగ్ అనుభూతులను చేరువ చేసేవిగా ఉన్నాయి.

ల్యాపీ ప్రధాన ఫీచర్లు:

- శక్తివంతమైన ఇంటెల్ కోర్ ప్రాసెసర్,

- ఎన్-విడియా జీటీ620 గ్రాఫిక్ ప్రాసెసర్,

- 500జీబి హైబ్రిడ్ స్టోరేజ్ డ్రైవ్,

- హై డెఫినిషన్ స్ర్కీన్,

- హెచ్‌డిఎమ్ఐ పోర్టు,

- యూఎస్బీ కనెక్టువిటీ.

అసస్ తాజా ఆవిష్కరణ యూఎక్స్21ఏ:

అసస్ తాజాగా లాంచ్ చేసిన ల్యాప్‌టాప్ ‘యూఎక్స్21ఏ’ హై డెఫినిషన్ స్ర్కీన్‌ను ఒదిగి ఉండటంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు హుందా అయిన పనితీరును ప్రదర్శిస్తాయి. అల్యూమినియం చాసిస్‌తో డిజైన్ కాబడిన ఈ ల్యాపీ ప్రొఫెష్‌నల్ లుక్‌ను సంతరించుకుంది.

ల్యాప్‌టాప్ ఇతన ఫీచర్లు పరిశీలిస్తే:

11.6 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, రిసల్యూషన్ 1920 X 1080పిక్సల్స్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెడ్జ్ ఐవీ‌ బ్రిడ్జ్‌కోర్ ప్రాసెసర్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్, ఇంటెల్ చిప్‌సెట్, ఇన్‌బుల్ట్ వెబ్‌క్యామ్, వీడియో రికార్డింగ్ సౌలభ్యత, 4జీబి ఇంటర్నల్ ర్యామ్, 250జీబీ ఎస్ఎస్‌డి, వై-పై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లౌడ్ స్పీకర్స్, 35వాట్ బ్యాటరీ (బ్యాకప్ 5 గంటలు), ధర అంచనా రూ.50,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot