యూకే మార్కెట్లోకి తొషిబా ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్!

Posted By: Super

యూకే మార్కెట్లోకి తొషిబా ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్!

 

దిగ్గజ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ తొషిబా, యూకే వినియోగదారుల కోసం సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. డివైజ్ మోడల్  తొషిబా ఏటీ300ఎస్ఈ(Toshiba AT300SE). స్ర్కీన్ పరిమాణం 10.1 అంగుళాలు.

పూర్తి  స్పెసిఫికేషన్‌లు:

10.1 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),

బరువు 625గ్రాములు, 10.5మిల్లీ మీటర్ల మందం,

ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1జీబి ర్యామ్,

16జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్,

టాబ్లెట్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 64జీబికి పొడిగించుకోవచ్చు.

బ్లూటూత్ 3.0,

వై-ఫై, జీపీఎస్,

3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

‘తొషిబా ఏటీ300ఎస్ఈ’ టాబ్లెట్ ను  ఈ ఏడాది చివరి నుంచి  యూకే మార్కెట్లో విక్రయించనున్నారు. ధర  £299.99.

బిజినెస్ వర్గాల కోసం తోషిబా స్పెషల్ ల్యాప్‌టాప్స్!

బిజినెస్ వర్గాల కోసం ప్రఖ్యాత కంప్యూటర్ల తయారీ బ్రాండ్ తోషిబా రెండు బిజినెస్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించింది. టెక్రా ఆర్940, టెక్రా ఆర్950 మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్లలో శక్తివంతమైన ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్‌లను వినియోగించారు. స్మార్ట్ క్లయింట్ మేనేజర్, ఫింగర్ ప్రింట్ రీడర్ వంటి పటిష్టమైన సెక్యూరిటీ స్పెసిఫికేషన్‌లను ఈ ల్యాపీలలో ఏర్పాటు చేశారు.

తోషిబా టెక్రా ఆర్940:

14 అంగుళాల స్ర్కీన్, బరువు 4.19ల్యాబ్స్, 5.9 గంటల బ్యాటరీ బ్యాకప్, 320జీబి హార్డ్‌డ్రైవ్, 512జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్, ఇంటెల్ మూడవ జనరేషన్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఎమ్‌డి గ్రాఫిక్ కంట్రోల్, 16జీబి ర్యామ్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, షాక్ ప్రూఫ్, స్పిల్ రెసిస్టెంట్, వై-పై, ప్రారంభ ధర రూ.32,000.

తోషిబా టెక్రా ఆర్950:

15 అంగుళాల స్ర్కీన్, బరువు 5.29ల్యాబ్స్, 5.7 గంటల బ్యాటరీ బ్యాకప్, 320జీబి హార్డ్‌డ్రైవ్, 512జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్, ఇంటెల్ మూడవ జనరేషన్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఎమ్‌డి గ్రాఫిక్ కంట్రోల్, 16జీబి ర్యామ్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,  షాక్ ప్రూఫ్, స్పిల్ రెసిస్టెంట్, వై-పై, ప్రారంభ ధర రూ.32,000.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot