దమ్ము చూపించిన హైదరాబాద్ కుర్రోళ్లు!!

By Super
|
AVE - Another “Desi” Tablet with International Qualities


భారతీయ సాంకేతిక పరికరాల విప్లవంలో కొత్త సంచలనం నమోదైంది. హైదరాబాద్ కుర్రాళ్లు చిమన్ ప్రకాష్, నిఖిల్ తమ ఇంజనీరింగ్ మేధస్సుతో ఆండ్రాయిడ్ ఆధారిత ‘AVE’ టాబ్లెట్ పీసీని రూపొందించారు.

ఈ టాబ్లెట్ కంప్యూటర్ ను రాష్ర్ల సమాచార మరియు ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గత వారం విడుదల చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పరికరాన్ని రూపొందించినట్లు రూపకర్తలు స్ఫష్టం చేశారు. తొలి నెలలోనే 10,000 పీసీలు అమ్మకాన్ని అంచనా వేస్తున్నట్లు ఈ యువకెరటాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

క్లుప్తంగా ‘AVE’ టాబ్లెట్ పీసీ ఫీచర్లు:

- అత్యాధునికి ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డ్ ప్లాట్ ఫామ్,

- 7 అంగుళాల డిస్ ప్లే,

- 1.2 GHz ప్రాసెసర్,

- ఇంటర్నెల్ మెమరీ 8జీబి, ఎక్సప్యాండబుల్ విధానం ద్వారా 32జీబికి పెంచుకోవచ్చు.

- టాబ్లెట్ పీసీ బరువు 360 గ్రాములు,

- బ్యాటరీ బ్యాకప్ 6 గంటలు,

- 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

- జీఎస్ఎమ్ సౌలభ్యత, 3జీ, వై-ఫై కనెక్టువిటీ సామర్ధ్యం

-‘AVE’ టాబ్లెట్ పీసీ ధర రూ.12,999గా తెలుస్తోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X