బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ఉచిత వై-ఫై

Posted By:

దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొట్టమొదటి సారిగా బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ లో భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన రైల్‌టెల్ కార్పొరేషన్ రైల్‌వైర్ బ్రాండ్‌బాండ్ పేరుతో వై-ఫై కనెక్టువిటీ సేవలను ప్రారంభించింది.

బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ఉచిత వై-ఫై

ఈ వై-ఫై కనెక్టువిటీ సేవలను ప్రయాణీకులు మొదటి 30 నిమిషాలు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఆ తరువాత నుంచి స్ర్కాచ్ కార్డ్‌లను కొనుగోలు చేసి వాటి ద్వారా అదనపు సమయాన్ని పొందవల్సి ఉంటుంది. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన వై-ఫై హెల్ప్ డెస్క్ వద్ద ఈ స్ర్కాచ్‌కార్డ్‌లను అందుబాటులో ఉంచారు. ఉచిత టాక్‌టైమ్ అయిపోయిన తరువాత, వై-ఫై సేవలను మరో 30 నిమిషాల పాటు పొందేదుకు రూ.25, గంట పాటు వాడుకునేందుకు రూ.35 విలువగల కూపన్‌లను ప్రయాణికులు కొనుగోలు చేయవల్సి ఉంటుంది.

24 గంటల వ్యాలిడిటీతో లభ్యమయ్యే ఈ స్ర్కాచ్ కార్డ్‌లను క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి పొందవచ్చు. త్వరలో ఈ తరహా వై-ఫై సర్వీసులను మరిన్ని ప్రముఖ రైల్వే స్టేషన్‌లకు విస్తరించనున్నట్లు రైల్‌టెల్ అధికారి ఒకరు తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Bangalore City railway station is first in India to offer 'free' Wi-Fi. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot