బరువు తగ్గించుకుని... నాజూకుగా ముందుకొస్తుంది!!

Posted By: Super

బరువు తగ్గించుకుని... నాజూకుగా ముందుకొస్తుంది!!

 

కంప్యూటింగ్ పరికరాల ఉత్పాదక సంస్ధ బార్నిస్, నోబుల్ నుంచి తొలి ఎడిషన్‌లో విడుదలైన ‘నూక్ టాబ్లెట్’ఆశించిన స్థాయికన్నాఅధిక బరువు కలిగి ఉండటంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. సమస్యను గ్రహించిన నూక్ యూజమాన్యం నాజుకైన శరీరాక్ళతి కలిగిన నూక్ న్యూ వర్షన్ టాబ్లెట్ కంప్యూటర్‌ను వ్ళద్ధి చేస్తున్నట్లు సమాచారం. నూతనంగా రూపదిద్దుకుంటున్న ఈ డివైజ్ ఆమోజోన్ కిండిల్ ఫైర్ టాబ్లెట్‌కు గట్టి పోటీనివ్వనుందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. సిలికాన్ వ్యాలీలో ఈ డివైజ్ తుదిమెరుగులు దిద్దుకుంటున్నట్లు బేర్నిస్, నోబుల్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆమోజోన్ కిండిల్ ఫైర్‌కు ధీటుగా రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త నూక్ టాబ్లెట్ ధర రూ.12,500 నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot