ముఖ్యమైన కంప్యూటర్ చిట్కాలు!
మీ పీసీలో యాంటీవైరస్ ఇన్‌స్టాల్ చేసి స్కాన్ చేసుకున్నట్టే మీ పీసీలో హార్డ్‌వేర్ భాగాలు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? కూడా చేక్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. చెక్ చేయడం చాలా సులభం. కంట్రోల్ ప్యానెల్‌లో డివైస్ మేనేజర్‌ను ఎంచుకుని అందులో సిస్టమ్‌నీ, దానిలో హార్డ్‌వేర్‌ని ఎంచుకుని దేనిలో సమస్యలున్నయా? అని చెక్ చేసుకోవచ్చు. దీనికన్నా సులభంగా పని ముగించుకోవాలంటే start menu-run డైలాగ్ బాక్స్‌లో winmsd అని టైప్ చేసి ఎంటర్‌కీ ప్రెస్ చేయండి. ఇక హార్డ్‌వేర్ పరిస్థితిని విరవించే రిపోర్టు రెడీగా కనిపిస్తుంది.

ముందుగా మీరు ఉపయోగించని అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.
పీసీ వేగాన్ని తగ్గించటంలో కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు కీలక పాత్రపోషిస్తాయి. కాబట్టి.. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. యాంటీ వైరస్ అప్‌డేట్‌ను రెగ్యులర్‌గా పొందుతూ పీసీని స్కాన్ చేసుకోవాలి.
మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.
పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీకరణలు పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








