‘బీటెల్ మ్యాజిక్’వ్యూహం వెనుక నేపధ్యం ఏంటి..?

Posted By: Staff

‘బీటెల్ మ్యాజిక్’వ్యూహం వెనుక నేపధ్యం ఏంటి..?

సాంకేతిక వినియోగదారులు అత్యధికంగా ఉన్న భారతీయ మార్కెట్ లో పంజా విసిరేందుకు పలు కంపెనీలు యత్నిస్తున్నాయి.ఈ కోవకే చెందిన ‘బీటెల్ మ్యాజిక్’చవక మంత్రాన్ని వినియోగదారుల పై ప్రయోగిస్తుంది. తగ్గింపు ధరకే మన్నికైన ఫీచర్లు కలిగిన టాబ్లెట్ పీసీలను వినియోగదారులకు అందిచేందుకు సంస్థ ముందుకొచ్చింది.

మునుపటి ‘టాబ్లెట్ పీసీ’ని అప్ గ్రేడ్ చేస్తూ, తాజాగా బీటెల్ మ్యాజిక్ కొత్త వర్షన్ టాబ్లెట్ పీసీని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘బీటెల్ మ్యాజిక్ 2’గా విడుదలైన సరికొత్త టాబ్లెట్ పరికరంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థను లోడ్ చేశారు.

768 MHz,క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసింగ్ వ్యవస్థను టాబ్లెట్ లో ఏర్పాటు చేశారు. పొందుపరిచిన 8జీబీ ఎస్డీ కార్డ్ ఫ్రీ ఇంటర్నెల్ మెమరీ, 16జీబీ ఎక్సటర్నల్ మెమరీలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

స్టన్నింగ్ బ్లాక్ ఫినిష్ లుక్ లో డిజైన్ చేయబడ్డ టాబ్లెట్ బాడీ ప్యానెల్ ప్రత్యేకంగా ఆకర్షస్తుంది. 7 అంగుళాల WVGA స్ర్కీన్ డిస్ ప్లే, టచ్ స్ర్కీన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టువిటీ అంశాలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి. 2జీ మరియు 3జీ వ్యవస్థలను టాబ్లెట్ సపోర్టు చేస్తుంది. ఏర్పాటు చేసిన టచ్ ప్యాడ్ వ్యవస్థ యూజర్ ఫ్రెండ్లీ స్వభావం కలిగి ఉంటుంది.

హై క్వాలిటీ కెమెరా వ్యవస్థను టాబ్లెట్ లో పొందుపరిచారు, గ్యాడ్జెట్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్, వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్స్లల్ కెమెరా వ్వవస్థలు నాణ్యమైన వీడియో ఛాటింగ్ అనుభూతితో, మన్నికైన చిత్రాలను నిక్షిప్తం చేస్తాయి. ఏర్పాటు చేసిన 2200 mAh లితియమ్ బ్యాటరీ వ్యవస్థ పటిష్ట బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

హై డెఫినిషన్ వీడియో ప్లేయర్ అప్లికేషన్ ను టాబ్లెట్ లో లోడ్ చేశారు. మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, 3.5 mm ఆడియో జాక్ అంశాలు వినియోగదారుడికి మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి. బీటెల్ మ్యాజిక్ పాత వర్షన్ ధర రూ.9,999కాగా కొత్త వర్షన్ ధర రూ.9,799 మాత్రమే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot