ఆ రెండిండి మధ్య ఎందుకంత రభస..!!

Posted By: Staff

ఆ రెండిండి మధ్య ఎందుకంత రభస..!!

టాబ్లెట్ మార్కెట్లోకి తాజాగా ఎంటరైన ‘బీటెల్’ సరికొత్త టాబ్లెట్ పీసీని మార్కెట్లో విడుదల చేసింది. వినియోగదారుల మొప్పు పొందిన ఈ ‘మ్యాజిక్’ టాబ్లెట్ పీసీకి , తైవాన్ కంపెనీ ఎమ్‌ఎస్‌ఐ రూపొందించిన ‘ఎంజాయ్ 7’ టాబ్లెట్ నుంచి గట్టిపోటి ఎదురవుతుంది. ఈ టాబ్లెట్లలోని ఫీచర్లు ఇంచుమించుగా ఒకేలా ఉండటంతో వీటి మధ్య పోటి మరింత ఉదృతి స్థాయికి చేరుకుంది.

7 అంగుళాల టచ్ స్క్రీన్ సామర్ధ్యం కలిగిన ఈ టాబ్లెట్లు 800 x 480 పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 2.2 వర్షన్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ‘బీటెల్ మ్యాజిక్’ రూపుదిద్దికుంటే, ఆండ్రాయిడ్ జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ‘ఎంజాయ్ 7’ పనిచేస్తుంది.

ప్రొసెస్సర్ల విషయానికి వస్తే ‘మ్యాజిక్’ 1 GHz ప్రొసెస్సర్ కలిగి ఉంది. ‘ఎంజాయ్ 7’ విషయానికి వస్తే 1.2 GHz కార్టెక్స్ ఆర్మ్ ప్రొసెస్సర్‌ను పొందుపరిచారు. నాణ్యమైన ప్రొసెస్సర్‌తో పాటు అత్యాధినిక ఆపరేటింగ్ వ్యవస్థలు ఎంజాయ్ 7లో ఉన్నప్పటికి 3జీ వ్యవస్థ లోపించింది. బీటెల్ మ్యాజిక్ విషాయనికి వస్తే వై - ఫై, జీపీఆర్‌ఎస్, ఎడ్జ్, 3జీ హెచ్‌డీసీపీఏ వంటి ఫీచర్లు ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను మరింత వేగవంతంగా నడిపిస్తుంది.

ఇక మెమరీ విషయానికి వస్తే ‘ఎంజాయ్ 7’ 512 MBగల ర్యామ్‌తో 4జీబీ స్టోరేజి కెపాసిటీ కలిగి ఉంది. అయితే ఈ సామర్ధ్యాన్ని మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 32 జీబీకి పెంచుకోవచ్చు. ర్యామ్‌తో కులుపుకుని 8 జీబీ మెమరీ సామర్థ్యం కలిగిన ‘బీటెల్ మ్యాజిక్’లో స్లాట్ ద్వారా 16జీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరా అంశాలను పరిశీలిస్తే ఈ రెండు టాబ్లెట్ పీసీలు ఒకే సామర్ధ్యం కలిగి ఉంటాయి. ఈ టాబ్లెట్లలో పొందుపరిచిన ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు 2 మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉంటాయి. బ్లూటూత్ అంశాన్ని పరిశీలిస్తే 2.1 A2DP వర్షన్‌ను ఈ రెండు పీసీలలో పొందుపరిచారు.

ఎంజాయ్ 7లోని అదనపు ఫీచర్లను పరిశీలిస్తే, లైట్ సెన్సార్, వైబ్రేషన్, మినీ హెడీఎమ్‌ఐ వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటాయి. ఇక బ్యాటరీ అంశాలను పరిశీలిస్తే లై ఐయాన్ బ్యాటరీ వ్యవస్థలు వీటిలో పొందుపరిచారు. బీటెల్‌లో 2200 mAh సామర్థ్యం గల బ్యాటరీని పొందుపర్చగా, ఎంజాయ్ 7లో 4000 mAh సామర్థ్యం గల బ్యాటరీని అనుసంధానించారు. వీటి ధరలను పరిశీలిస్తే బీటెల్ మ్యాజిక్ మార్కెట్ ధర రూ.9900 ఉండగా, ఎంజాయ్ 7 మార్కెట్ ధర రూ.13,999 పలుకుతుంది. అయితే ఈ రెండు టాబ్లెట్లు వినియోగదారుడిని సంతృప్తి పరుస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot