‘లక్ష్మీ’తో ‘ఎయిర్ టెల్’...!!

అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దబడిన టాబ్లెట్లను వినియోగదారులకు అందించేందకు ఈ రెండు బ్రాండ్లు దృష్టిసారిస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దకున్న బీటెల్ మ్యాజిక్, పెప్పర్ M74V (లక్ష్మీ) టాబ్లెట్ పీసీలు 7 అంగుళాల నాణ్యమైన డిస్ ప్లే స్క్రీన్ కలిగి ఉంటాయి.
కెమెరా విషయానికి వస్తే ఈ రెండు బ్రాండ్ల మధ్య స్వల్ప తేడాలను మనం గమనించవచ్చు. బీటెల్ మ్యాజిక్ టాబ్లెట్ పీసీలో రెండు కెమెరాలను పొందుపరిచారు. ముందుభాగంలో అమర్చిన కెమెరా వీజీఏ రిసల్యూషన్ కలిగి వీడియో ఛాటింగ్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. వెనుక భాగంలో అమర్చిన కెమెరా ఫోటోలు తీసుకునేందుకు వీలుగా ఉంటుంది. పెప్పర్ విషయానికి వస్తే వీడియో ఛాటింగ్‌కు అనుగుణంగా ముందు భాగంలో మాత్రమే ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
కనెక్టువిటీ, డేటా మేనేజిమెంట్ అంశాలను పరిశీలిస్తే యూఎస్బీ పోర్ట్స్, వై - ఫై, బ్లూటూత్ వంటి అత్యుత్తమ అంశాలు ఈ టాబ్లెట్లలో దర్శనమిస్తాయి. ఇక డేటా స్టోరేజి విషయానికి వస్తే బీటెల్ మ్యాజిక్ ముందంజలో ఉంది. 8జీబీ ఇంటర్నల్ మెమరీ సామర్ధ్యాన్ని ఈ పీసీలో పొందుపరిచారు. అయితే ఎక్సటర్నల్ స్లాట్ సహకారంతో ఈ జీబీని 32 జీబీకి పొడగించుకోవచ్చు.
మెమరీ విషయంలో లక్ష్మీ కాస్తంత వెనకంజలో ఉంది. కేవలం 4జీబీ ఇంటర్నల్ మెమరీ, ఎక్సటర్నల్ స్లాట్ ద్వారా 16జీబీకి పొడిగించుకోవచ్చు. మన్నికైన బ్యాటరీ వ్యవస్థను ఈ గ్యాడ్జెట్లలో పొందుపరిచారు. మన్నిక విషయంలో ఇంచుమించుగా ఒకే పోలిక కలిగి ఉన్న ఈ టాబ్లెట్ పీసీలు ధరల విషయానికి వస్తే బీటెల్ మ్యాజిక్ రూ.9999 ఉండగా, లక్ష్మీ పెప్పర్ M74V ధర రూ.6500 మాత్రమే, సో ఏది బెస్టో మీరే డిసైడ్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








