‘ఎయిర్ టెల్’తో పోటీనా...?

Posted By: Staff

‘ఎయిర్ టెల్’తో పోటీనా...?

టాబ్లెట్ పీసీలకు అధికంగా డిమాండ్ ఉన్న ఇండియన్ మార్కెట్లో వివిధ భ్రాండ్ల మధ్య పోటి రోజు రోజుకు ఉధృతమవుతుంది. తాజాగా ఎయిర్ టెల్ విడుదల చేసిన ‘బీటెల్ మ్యాజిక్’ టాబ్లెట్ పీసీకి, మొబైల్ టెలీ సిస్టమ్స్ (ఎంటీఎస్) రూపంలో ఎదరుదెబ్బతగలనుంది. ‘మ్యాజిక్’ పీసీలో పొందుపరిచిన ఫీచర్లతో ఎంటీఎస్ ‘1055’ పేరుతో టాబ్లెట్ పీసీని మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

వీటి ఫీచర్లను పరిశీలిస్తే ఈ రెండు టాబ్లెట్ పీసీలు ఆండ్రాయిడ్ ఫ్రోయో 2.2 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తాయి. రెండు సెట్లలో పొందుపరిచిన క్వాలకమ్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసింగ్ వ్యవస్థ సమర్ధమైన పనితీరును కలిగి ఉంటుంది.

కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే శక్తివంతమైన 802.11 b/g/n వై - ఫై వ్యవస్థ ఈ రెండు పీసీలలో దర్శనమిస్తుంది. ఈ సెట్లలో ఏర్పాటుచేసిన A2DP వర్షన్ బ్లూటూత్ వ్యవస్థ డేటాను వేగవంతంగా ట్రాన్స్ ఫర్ చేస్తుంది. ఎంటీఎస్ టాబ్లెట్లో 10/100 ఎంబీ ఇతర్ నెట్ పోర్టును ఏర్పాటు చేసినప్పటికి ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది.

రేర్ కెమెరా 3.2 మోగా పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. రేర్ కెమెరా విషయంలో బీటల్ మ్యాజిక్ 2 మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగి వెనకబడి ఉంది. బీటెల్ మ్యాజిక్ ప్రత్యేకతలను పరిశీలిస్తే పొందుపరిచిన వీజీఏ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ నాణ్యమైన వీడియో కాన్ఫిరెన్సింగ్ నిర్వహించుకునేందుకు ఉపకరిస్తుంది.

మెమరీ అంశాలను పరిశీలిస్తే బీటెల మ్యాజిక్ 8 జీబీ ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంటుంది. ఎక్సటర్నల్ స్లాట్ విధానం ద్వారా ఈ జీబిని 16కు వృద్ధి చేసుకోవచ్చు. బూట్ లోడర్ వ్యవస్థను ‘మ్యాజిక్’లో పొందుపరిచారు. ఎంటీఎస్ మెమరీ వ్యవస్థకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. బ్యాటరీ వ్యవస్థను పరిశీలిస్తే ఎంటీఎస్ 3400 mAh సామర్ధ్యం కలిగి ఉండగా, బీటెల్ మ్యాజిక్ 2200 mAh సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ టాబ్లెట్ పీసీలు ఇంచుమించుగా సమాన ఫీచర్లు కలిగి ఉన్నప్పటికి, ‘బీటెల్ మ్యాజిక్’ పలు అంశాల్లో ఎంటీఎస్ పై అధిక్యత ప్రదర్శిస్తుంది వీటి ధరల విషయంలో వృత్యాసాన్ని పరిశీలిస్తే ఎంటీఎస్ 1055 టాబ్లెట్ పీసీ రూ.8000 కలిగి ఉంటే బీటెల్ మ్యాజిక్ రూ.9,000ను కలిగి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting