ఎయిర్ టెల్, రిలయన్స్ ల మధ్య టాబ్లెట్ల యుద్ధం..!!

Posted By: Staff

ఎయిర్ టెల్, రిలయన్స్ ల మధ్య టాబ్లెట్ల యుద్ధం..!!

భారతీ ఎంటర్‌ఫ్రైజస్ గ్రూప్ (ఎయిర్ టెల్), రిలయన్స్ కమ్యూనికేషన్ల మధ్య ప్రత్యక్ష యద్ధం నెలకుంది. సెల్ ఫోన్ నెట్‌వర్కింగ్ వ్యవస్థలోనూ పోటిపిడిన ఈ బ్రాండ్లు తాజాగా టాబ్లెట్ పీసీ మార్కెట్లో పోటిపడనున్నాయి. తమ బ్రాండ్ల విశ్వసనీయతకు తగ్గట్లుగా టాబ్లెట్ పీసీలను ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకట్టకునేందుకు ఇరు కంపెనీలు పాచికులు విసిరాయి.

అయితే ఇప్పటికి రిలియన్స్ పెట్టిన ‘రిలియన్స్ 3జీ టాబ్లెట్’ (Reliance 3G tablet) మార్కెట్లో విడుదల కాగా, భారతీ ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టనున్న ‘బీటల్ మ్యాజిక్’ ( Beetel Magiq) అతి త్వరలో విడుదల కానుంది.

వీటిలోని ఫీచర్లను మనం పరిశీలిస్తే ‘బీటల్ మ్యాజిక్’ ఆండ్రాయిడ్ v2.2 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుంది. ఇక ‘రిలయన్స్ 3జీ’ విషయానికి వస్తే 2.3 జింజర్ బోర్డు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పని చేస్తుంది. ఈ రెండు టాబ్లెట్లు 7 అంగుళాల వైడ్ టచ్ స్ర్కీన్ స్వభావం కలిగి ఉంటాయి. ఇక బరువు విషయానికి వస్తే ‘రిలియన్స్ 3జీ’ 389 గ్రాములు, ‘బీటల్ మ్యాజిక్’ 355 గ్రాముల బరువు కలిగి ఉంటాయి.

కెమెరా విషయంలోనూ ఒకే స్వభావం కలిగి ఉన్నఈ టాబ్లెట్ పీసీలు, 2 మోగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటాయి. అయితే మెమరీ విషయంలో మాత్రం ‘బీటల్ మ్యాజిక్’కు 16 జీబీ వరకు మెమరీని పెంచుకునే వెసలబాటు ఉంటే , ‘రిలయన్స్ 3జీ’కి మాత్రం 32జీబీ వరకు మెమరీని పొడిగించుకునే సౌలభ్యత ఉంది.

‘రిలియన్స్ 3జీ’లో పొందుపరిచిన మరో ఫీచర్ లైవ్ టీవిని మీకు అందిస్తుంది. ఈ స్పెషాలిటీ ద్వారా మీకు నచ్చిన ఛానల్‌ను ప్రత్యక్షంగా చూడోచ్చు. ఇక కెనెక్టువిటీ విషయానికి వస్తే ఈ పరికరాల్లో అమర్చిన బ్లూటూత్, వై - పై, 3జీ వంటి వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి సంబంధించి పొందుపరిచిన ఎంపీత్రీ ప్లేయర్, వీడియో ప్లేయర్, తదితర గేమింగ్ అంశాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.

ఇక వీటి ధరల విషయాన్ని పరిశీలిస్తే ‘బీటెల్ మ్యాజిక్’ ధరకన్నా రిలియన్స్ 3జీ టాబ్లెట్ ధర అధికం. మార్కెట్లో రిలయన్స్ 3జీ టాబ్లెట్ ధర రూ.12,999 ఉంది. అయితే భారతీ ఎయిర్‌టెల్ తాము ప్రవేశపెట్టబోతున్న ‘బీటల్ మ్యాజిక్’ ధర రూ.8999గా ప్రకటించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot