జీవితాన్ని మలుపు తిప్పే ‘గొప్ప డీల్’!!

Posted By: Staff

జీవితాన్ని మలుపు తిప్పే ‘గొప్ప డీల్’!!

 

మైక్రోమ్యాక్స్ లాంఛ్ చేసిన ఫన్‌బుక్ టాబ్లెట్ కంప్యూటర్‌కు మార్కెట్లో అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆండ్రాయిడ్ సరికొత్త వోఎస్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై పని చేసే ఈ డివైజ్ హాట్ కేకులా అమ్ముడుపోతుంది. ఉత్తమ ఈ-కామర్స్ సైట్‌లలో ఒకటైన snapdeal.com, ఫన్‌బుక్ పై ఆశాజనకమైన రాయితీలను అందిస్తుంది. మా ఆన్‌లైన్ సైట్ ద్వారా ప్రతి రెండు నిమిషాలకు ఓ ఫన్‌బుక్ కోనుగోలు జరుగుతోందని స్నాప్‌డీల్ వర్గాలు ప్రకటించాయి. ఇండియన్ మార్కెట్లో ఫన్‌బుక్ నిర్ణీత ధర రూ.6,499.

ఫన్‌బుక్ ఫీచర్లు వాటి పనితీరు క్లుప్తంగా:

ఫన్‌బుక్‌గా మార్కెట్లో లభ్యమవతున్న ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవనుంది. తక్కువ ధర గ్యాడ్జెట్ అయినప్పటికి పనితీరు విషయంలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తుంది. నిక్షిప్తం చేసిన 1.2 జిగాహెడ్జ్ ప్రాసెసర్ డివైజ్ పనివేగాన్ని రెట్టింపు చేస్తుంది. 7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే 800 x 480 పిక్సల్ హై రిసల్యూషన్‌ను కలిగి ఉంటుంది. మల్టీ టచ్ ఇన్‌పుట్‌లతో పాటు జూమ్ ఆప్షన్‌లను సపోర్ట్ చేస్తుంది.

పీసీలో నిక్షిప్తం చేసిన మన్నికైన గ్రాఫిక్ ప్రాసెసర్ ఉత్తమమైన మల్టీ మీడియా అనుభూతులను చేరవచేస్తుంది. ఇంటర్నల్ మెమెరీ 4జీబి, ర్యామ్ సామర్ద్యం 512ఎంబీ. మైక్రో‌ఎస్డీ కార్డ్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు.

ఏర్పాటు చేసిన వై-ఫై, 3జీ కనెక్టువిటీ వ్యవస్థలు వేగవంతమైన ఇంటర్నెట్‌ను సపోర్ట్ చేస్తాయి. వినియోగదారుడు ఈ టాబ్లెట్ కోనుగోలు పై టాటా ఫూటాన్ EVDO డేటా కార్డును ఉచితంగా పొందవచ్చు.

కొన్ని నెలల పాటు ఈ కార్డ్ నుంచి 1జీజి డేటా వరకు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్లాక్, స్లేట్ గ్రే కలర్ వేరియంట్‌లలో గ్యాడ్జెట్ డిజైన్ కాబడింది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన వీజీఏ ఫ్రంట్ కెమెరా 0.3 మెగా పిక్సల్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పలు బేసిక్ అప్లికేషన్‌లను ముందుగానే ప్రీలోడ్ చేశారు. ఎంబీఏ, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు కోసం స్టడీ మెటీరియల్‌ను పీసీలో నిక్షిప్తం చేశారు. ధర రూ.6,499. ఇంకెందుకు ఆలస్యం

snapdeal.comలోకి లాగినై ఫన్‌బుక్‌ను గొప్ప రాయితీతో సొంతం చేసుకోండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot