రూ.20 వేల ధరలో బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. లిస్ట్, ఫీచర్ల వివరాలు..!
భారత్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా కొవిడ్ అనంతరం ఆన్‌లైన్ క్లాస్‌లు, వర్క్ ఫ్రం హోం సహా ఇతర అవసరాల కోసం ల్యాప్‌టాప్‌లు వినియోగించే వారి సంఖ్య అధికమయింది. అయితే చిన్నారులు, విద్యార్థుల కోసం కూడా ఇటీవల కాలంలో అనేక సంస్థలు ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ప్రస్తుతం రూ.20 వేల ధర సెగ్మెంట్‌లో (Best Laptops Under Rs20000 Price) విద్యార్థులు సహా ఇతర అవసరాల కోసం అనేక ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో ఏసర్, లెనోవో సహా అనేక బ్రాండ్‌లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లు రోజువారీ అవసరాల కోసం ఉపయోగపడతాయి.

* ఏసర్ ఎస్పైర్ 3 ల్యాప్‌టాప్ :
ఏసర్ ఎస్పైర్ 3 ల్యాప్‌టాప్ (Acer Aspire 3) ప్రస్తుతం ధర రూ.18999 గా ఉంది. ఈ ల్యాప్‌టాప్ 11.6 అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. Intel Celeron N4500 ప్రాసెసర్ పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా HD కెమెరాను కలిగి ఉంది. 38Wh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ ల్యాప్‌టాప్ రోజువారీ ఆన్‌లైన్ క్లాసులు, బ్రౌజింగ్, మీటింగ్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ కేవలం 1 KG బరువుతో అందుబాటులోకి వచ్చింది. సౌకర్యవంతంగా వినియోగించుకొనేందుకు అవకాశం ఉంది.
* ASUS క్రోమ్‌బుక్ CX14 :
ఈ ల్యాప్‌టాప్ (ASUS Chromebook CX14) ప్రారంభ ధర రూ.18990 గా ఉంది. 60Hz రీఫ్రెష్ రేట్‌తో 14 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ Intel Celeron ప్రాసెసర్, క్రోమ్OS పైన పనిచేస్తోంది. గూగుల్ ఏఐ సబ్‌స్క్రిప్షన్‌ను 3 నెలలపాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ప్రొడక్టివిటీ, ఏఐ పవర్ టూల్స్‌ను సపోర్టు చేస్తుంది.
* లెనోవో క్రోమ్‌బుక్ జెన్ 4 :
ఈ ల్యాప్‌టాప్ (Lenovo Chromebook Gen 4) ధర రూ.14990 గా ఉంది. 11.6 అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. 720p వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. ఆన్‌లైన్ క్లాసులు, వెబ్ బ్రౌంజింగ్ కోసం వినియోగించుకోవచ్చు.
* ప్రైమ్‌బుక్ 2 నియో :
ఈ ల్యాప్‌టాప్ (Primebook 2) ప్రస్తుతం రూ.15990 గా ఉంది. కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌తో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్న అనుభూతిని పొందుతారు. దీంతోపాటు ప్రైమ్ X క్లౌడ్ PC యాప్‌ను సపోర్టు చేస్తుంది.

* జియోబుక్ 11 :
ఈ ల్యాప్‌టాప్ (Jiobook 11) ప్రస్తుతం రూ.12990 ధరకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ అనుభూతితో విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుంది. మీడియాటెక్ ప్రాసెసర్ పైన పనిచేస్తోంది. ఆన్‌లైన్ తరగతులు, వెబ్ బ్రౌజింగ్ కోసం అనువుగా ఉంటుంది.
ఈ ల్యాప్‌టాప్ యాంటీ గ్లేర్ HD డిస్‌ప్లే, స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. అల్ట్రా కంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 8 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








