ల్యాప్‌టాప్ వేడిని తగ్గించేందుకు తీరైన మార్గాలు

Posted By:

ల్యాప్‌టాప్.. నేటి ఆధునిక కంప్యూటింగ్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేస్తోంది. అయితే ల్యాప్‌టాప్‌ను శరీరం పై పెట్టుకుని ఉపయోగించటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ల్యాప్‌టాప్ ద్వారా వెలువడే వేడి ‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే వ్యాధికి కారణంకాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్ నుంచి ఉత్పత్తి అయ్యే వేడి శరీరాన్ని నల్లగా మార్చటంతో పాటు, చర్మ సంబంధిత అలర్జీలకు కారణమవుతుందని వైద్యులు పలు కేసుల్లో నిర్థారించటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాప్‌టాప్ అధిక వేడిని విడుదల చేయటానికి గల ప్రధాన కారణాలు

ల్యాప్‌టాప్ పై ఎక్కువుగా పని చేయటం.  ల్యాప్‌టాప్‌నువేడి వాతావరణంలో ఉంచటం.

ల్యాప్‌టాప్ అధిక వేడిని విడుదల చేయటానికి గల ప్రధాన కారణాలు

ల్యాపీలో వెంటిలేషన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం. అనవసర యూఎస్బీ కేబుళ్లను ల్యాప్‌టాప్‌కు ఉంచేయటం.

ల్యాప్‌టాప్ అధిక వేడిని విడుదల చేయటానికి గల ప్రధాన కారణాలు

ల్యాపీని ఉంచిన ప్రాంతం దుమ్ము, ధూళీతో ఉండటం.  ల్యాప్‌టాప్ డిజైనింగ్‌లో లోపం.

ల్యాప్‌టాప్ వేడిని తగ్గించేందుకు తీరైన మార్గాలు

వీలైనంత వరకు అత్యవసర సమాయాల్లోనే ల్యాపీని ఉపయోగించండి. ఇంటి వద్ద ఉన్న సమయంలో డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను ఉపయోగించండి.

ల్యాప్‌టాప్ వేడిని తగ్గించేందుకు తీరైన మార్గాలు

ల్యాపీతో ప్రయాణించాల్సి వచ్చి, అదే సమయంలో ఉపయోగించాల్సి వస్తే ముందుగా ఓ మొత్తటి గుడ్డను తొడల పై ఉంచి ఆ తరువాత ల్యాపీని ఆన్ చేయండి.

ల్యాప్‌టాప్ వేడిని తగ్గించేందుకు తీరైన మార్గాలు

వేడి ఎక్కువగా ఉన్నచోట ల్యాపీని వినియోగించినట్లయితే బ్యాటరీకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అంతే కాదు కొన్ని సందర్భాల్లో బ్యాటరీ పేలిపోవచ్చు. కాబట్టి వేడి వాతావారణంలో ల్యాప్‌టాప్‌ను వీలైనంతవరకు ఉపయోగించవద్దు.

ల్యాప్‌టాప్ వేడిని తగ్గించేందుకు తీరైన మార్గాలు

ల్యాపీని ఎండలో పార్క్ చేసిన వాహనాల్లో ఉంచొద్దు.

ల్యాప్‌టాప్ వేడిని తగ్గించేందుకు తీరైన మార్గాలు

అలానే ఓపెన్ చేసిన ల్యాప్‌టాప్‌ను ఏసీ గది నుంచి బయటకు పదే పదే మార్చవద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Best Tips To Cool Your Laptop. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot