కంప్యూటర్ క్లీనింగ్... ఇలా!!
ముఖ్యంగా కంప్యూటర్‌ను శుభ్రం చేసే సమయంలో పీసీకి ఉన్న విద్యుత్ సరఫరా కేబుల్‌ను తొలగించాలి. ఈ కేబుల్ తీయకుండా కంప్యూటర్‌ను శుభ్రం చేయటం ద్వారా షాక్ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి, కంప్యూటర్‌ను శుభ్రం చేసే సమయంలోతప్పనిసరిగా విద్యుత్ సరఫరా కేబుల్‌ను తొలగించాలి.

ఆ తరువాతి చర్యగా మిగితా వైర్లను కూడా తొలగించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఉపకరణాలైన కీబోర్డ్, మౌస్‌లు అధికంగా దమ్ముతో నిండి ఉంటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా శుభ్రం చేయండి. అదేవిధంగా సీపీయూ లోపలి భాగాలను ప్రతి ఆరెనెలలకొకసారి శుభ్రం చేయటం మరవద్దు.
కంప్యూటర్ పనితీరు శుభ్రత పై కూడా ఆధారపడి ఉంటుదన్న మరచిపోవద్దు. కంప్యూటర్‌లో అధికంగా దమ్ము కనబడే ప్రాంత స్ర్కీన్. మోనిటర్ పై దుమ్ము ఉన్నట్లయితే కనిపించే విజువల్స్ మసగ్గా అనిపిస్తాయి. కాబటి, మోనిటర్ పై దుమ్ము పడకుండా జాగ్రత్త వహించాలి. మోనిటర్ క్లీనింగ్‌లో భాగంగా మెత్తనిగుడ్డతో పాటు కొలిన్ లక్విడ్ వంటి వస్తులను ఉపయోగించవచ్చు.
పర్సనల్ కంప్యూటర్‌ల క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే లోపలి కాంపోనెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కంప్యూటర్ లోపలి భాగాల్లో దుమ్ము అతిగా పేరుకుపోవటం వల్ల పీసీ పనితీరు మందగిస్తుంది. ఎక్స్‌టర్నల్ ఫ్యాన్ భాగం దెబ్బతింటుంది. దుమ్ము అతిగా పేరుకుపోవటం కారణంగా సీపీయూ లోపలి భాగంలో వేడి ఉష్ణోగ్రతలు అధికమై పీసీ మధ్యమధ్యలో ఆగిపోవటం మొదలుపెడుతుంది. ప్రణాళికాబద్ధంగా మీ వ్యక్తిగత కంప్యూటర్‌ను శుభ్రం చేసుకోవటం ఉత్తమం.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications