పాస్‌వర్డ్స్‌ను రికవర్ చేసుకునేందుకు బెస్ట్ టూల్!
పాస్‌వర్డ్ మర్చిపోవటం వల్ల మీ విండోస్ అడ్మినిస్ట్రేటర్ అకౌంటర్‌లోకి లాగిన్ కాలేక పోతున్నారా..? మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ పాస్‌వర్డ్‌ను రికవర్ చేసుకునే మార్గాల కోసం అన్వేషిస్తున్నారా..?
పాస్‌వర్డ్ మర్చిపోవటం వల్ల మీ విండోస్ అడ్మినిస్ట్రేటర్ అకౌంటర్‌లోకి లాగిన్ కాలేక పోతున్నారా..? మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ పాస్‌వర్డ్‌ను రికవర్ చేసుకునే మార్గాల కోసం అన్వేషిస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. ఆన్‌లైన్‌లో లభ్యమవుతోన్న పాస్‌వర్డ్ రికవరీ బండిల్ అనే టూల్‌ను ఉపయోగించుకోవటం ద్వారా అన్ని రకాల పాస్‌వర్డ్‌లను సింగిల్ అప్లికేషన్ ద్వారా రికవర్ చేసకునే వీలుంటుంది. ఈ టూల్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పాస్‌వర్డ్ రికవరీ బండిల్ ద్వారా ఏ విధమైన పాస్‌వర్డ్‌లను రికవర్ చేసుకోవచ్చు?
పాస్‌వర్డ్ రికవరీ బండిల్ టూల్ ద్వారా మరిచిపోయిన విండోస్ పాస్‌వర్డ్‌లను సునాయాశంగా బైపాస్ లేదా రీసెట్ చేసుకునే వీలుంటుంది. ఈ టూల్, విండోస్ అకౌంట్లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను ప్లెయిన్ టెక్స్ట్ రూపంలో కూడా చూపించగలుగుతుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్స్ఎల్, పవర్ పాయింట్, పీడీఎఫ్, ఆర్ఏఆర్ ఇంకా జిప్ ఫైల్స్‌కు సంబంధించిన పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను రిమూవ్ చేసి వాటిని సులువుగా ఉపయోగించుకునేలా చేయగలుగుతుంది.

పాస్‌వర్డ్‌లను సింపుల్‌గా రిట్రైవ్ చేయగలుగుతుంది...
వెబ్ బ్రౌజర్స్, ఈమెయిల్ క్లయింట్స్, ఇన్‌స్టెంట్ మెసెంజర్స్, ఎఫ్‌టీపీ క్లయింట్స్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లను ఈ టూల్ సింపుల్‌గా రిట్రైవ్ చేయగలుగుతుంది. వీటితో పాటు విండోస్, ఆఫీస్, అడోబ్ వంటి సాఫ్ట్ వేర్ లకు సంబంధించి ప్రొడక్ట్ కీలను ఈ టూల్ రికవర్ చేయగలుగుతుంది. పాస్‌వర్డ్ రికవరీ బండిల్ టూల్‌ను మీ డివైస్‌లో రన్ చేసి స్టార్ట్ రికవరీ బటన్ పై క్లిక్ చేసినట్లయితే డెస్క్‌టాప్ మెయిల్ క్లైంట్స్‌లో సేవ్ అయి ఉన్న మీ అవుట్‌లుక్ అకౌంట్ పాస్‌వర్డ్స్ సునాయాశంగా రిట్రైవ్ కాబడతాయి.

పాస్‌వర్డ్ రికవరీ బండిల్ టూల్‌తో పీడీఎఫ్ పాస్‌వర్డ్‌ను రికవర్ చేసుకోవటం ఎలా..?
ఏదైనా పీడీఎఫ్ డాక్యుమెంట్‌కు సంబంధించి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నట్లయితే దాన్ని పాస్‌వర్డ్ రికవరీ బండిల్ టూల్ ద్వారా సింపుల్‌గా రిమూవ్ చేయవచ్చు. డివైస్‌లో టూల్‌ను ఓపెన్ చేసిన తరువాత "Recover From File" బటన్ పై క్లిక్ చేసినట్లయితే సపోర్టెడ్ ఫైల్స్‌కు సంబంధించిన జాబితా మీకు కనిపిస్తుంది.

యూజర్ పాస్‌వర్డ్‌ను రిమూవ్ చేయవల్సి వస్తే...
వాటిలో "PDF Password" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మీ పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ పీడీఎఫ్ డాక్యుమెంట్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. డాక్యుమెంట్ సెలక్ట్ అయిన తరువాత మీ పీడీఎఫ్ ఫైల్‌కు ఏ విధమైన పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ యాడ్ అయి ఉందనేది మీరు తెలుసుకోవల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ప్రొటెక్షన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. వాటిలో మొదటిది "Recover User Password" కాగా రెండవది "Remove Owner Password" ఆప్షన్. వీటిలో Owner Passwordను సులువుగా రిమూవ్ చేసే వీలుంటుంది. ఇదే సమయంలో యూజర్ పాస్‌వర్డ్‌ను రిమూవ్ చేయవల్సి వస్తే బ్రూట్ ఫోర్స్, మాస్క్, డిక్షనరీ ట్రాక్ వంటి క్రాకింగ్ టూల్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.

విండోస్ అడ్మిన్ అకౌంట్‌లను రికవర్ చేసుకునేందుకు..
విండోస్ అడ్మిన్ అకౌంట్లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను రికవర్ చేసుకునేందుకుగాను పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకునేందుకుబండిల్ టూల్ మీకోసం ప్రత్యేకమైన బూటల్ మీడియాను మీకు క్రియేట్ చేసిపెడుతుంది. బూటబుల్ మీడియా అంటే సీడీ లేదా యూఎస్బీ డ్రైవ్ అని అర్థం. ఈ ప్రొసీజర్ ప్రారంభించే ముందు పాస్‌వర్డ్ రికవరీ బండిల్ టూల్‌ను ఓపెన్ చేసి "Windows Password" పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే ఆప్షన్‌లలో "Create Password Reset Bootdisk" ఆప్షన్‌ను మీరు సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

పాస్‌వర్డ్ విజయవంతంగా రీసెట్ కాబడుతుంది...
ఈ సమయంలో ఖాళీ సీడీ లేదా యూఎస్బీ ఫ్లాష్‌డ్రైవ్ మీ మెచీన్‌లో ఇన్సర్ట్ అయి ఉండాలి. ఇవి డిటెక్ట్ అయిన తరువాత బిల్ట్-ఇన్ ఐఎస్ఓ మెసేజ్‌ను రైట్ చేసేందుకు Start Burn బటన్ పై క్లిక్ చేయండి. బర్నింగ్ పూర్తి అయిన తరువాత సీడీ లేదా యూఎస్బీ డ్రైవ్‌ను కంప్యూటర్ నుంచి ఇజెక్ట్ చేసి మీ లాకుడ్ కంప్యూటర్‌ను బూటప్ చేసుకునేందుకు ఉపయోగించండి. పీసీఅన్‌లాకర్ స్ర్కీన్‌ను పొందిన తరువాత లోకల్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకుని రీసెట్ పాస్‌వర్డ్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే పాస్‌వర్డ్ విజయవంతంగా రీసెట్ కాబడుతుంది.


Click it and Unblock the Notifications