‘భారతీయుని’ కల నెరవేరనుంది..!!

By Super
|
Solar powered Indian Tablet
మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లల కొర్కెలను తీర్చటంలో విఫలమవుతున్నారు. ఎక్కువ మార్కులు సాధిస్తే కంప్యూటర్ కొనిపెడతామని ఆశపెట్టి వాటిని నెరవేర్చటంలో విఫలమవుతున్నారు. అంచెలంచెలుగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికి సామాన్యునికి మాత్రం అది అంతుచిక్కటం లేదు. తమ పిల్లలను ప్రయోజితులను చేరసే సాంకేతిక వ్యవస్థ సామన్య ప్రజలకు అందని ద్రాక్షలా నిలిచింది.

అసాధ్యాన్ని.. సుసాధ్యం చేస్తూ ‘భారత్ ఎలక్ట్రానిక్స్’ (Bharat Electronics) ఓ వినూత్న ఓరవడికి శ్రీకారం చుట్టుంది. ఈ ఒరవడితో సగటు భారతీయుని కల నెరవేరనుంది.. ఈ ప్రక్రియతో లక్షల సంఖ్యలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు లబ్ధిపొందుతాయి. దేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టారైన ‘భారత్ ఎలక్ట్రానిక్స్’ అతి తక్కవు ధరతో కూడిన టాబ్లెట్ పీసీని లాంఛ్ చేసింది.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పని చేసే ఈ టాబ్లెట్ పేరు ‘స్లేట్’ (slate). ఈ సాంకేతిక పరికరాన్ని సామాన్య మధ్యతరగతి ప్రజలకు చేరువచేసే క్రమంలో భారతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ టాబ్లెట్ను డిజైన్ చేసింది. రూ.3000 వేల నిర్థేశిత ధరతో ఈ టాబ్లెట్ పీసీలను విక్రయించేందుకు ‘బెల్’ ప్రణాళికలు రూపొందిస్తుంది.

ఈ టాబ్లెట్ విశిష్టతలను పరిశీలిస్తే స్లేట్ లో పొందుపరిచిన బ్యాటరీ సోలార్ వ్యవస్థతో ఛార్జింగ్ అవుతుంది. అయితే బెల్ ఈ సంవత్సరంలోనే 6 లక్షల టాబ్లెట్ పీసీలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే వీటి అమ్మకం ద్వారా బెల్ కు ఆదాయం ఈ ఏడాది రూ.వెయ్యి కోట్ల వరకు ఉండొచ్చని పోవర్టీ సర్వేలో తేలింది. అయితే విడుదల కాబోతున్న ‘భారత్ స్లేట్’ పీసీల పై భారీ అంచనాలే నెలకున్నాయి. ఒక వేళ ఈ టాబ్లెట్ పీసీ మార్కెట్లో క్లిక్ అయితే మిగిలిన కంపెనీలు ధర విషయంలో ఆలోచించాల్సిందే.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X