సామాన్యులకు కోసం రూ 15,000లకే బిజ్ బుక్ టాబ్లెట్

Posted By: Staff

సామాన్యులకు కోసం రూ 15,000లకే బిజ్ బుక్ టాబ్లెట్

ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో బిజ్‌ గ్రూపు ఎనిమిది అంగుళాల బిజ్‌ బుక్‌ (టాబ్లెట్‌ పర్సనల్‌ కంప్యూటర్‌) 1ఐ, 3జీ మోడళ్లను సోమవారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. స్థానిక ఫ్యాప్సీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఛైర్మన్‌ సుబ్రహ్మణ్యం బిజ్‌ బుక్‌ 3జీ మోడల్‌ను, ఫ్యాప్సీ సెక్రెటరీ జనరల్‌ ఎం.వి.రాజేశ్వరరావు బిజ్‌ బుక్‌ 1ఐ మోడల్‌ను విడుదల చేశారు.

దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్న మొట్టమొదటి 8 అంగుళాల టాబ్లెట్‌ పర్సనల్‌ కంప్యూటర్‌ ఇది అని బిజ్‌ గ్రూప్‌ సీఈవో పి.నిధిన్‌రావు వెల్లడించారు. ఈ విప్లవాత్మమైన పరికరం యాండ్రాయిడ్‌ 2.3 (జింబర్‌బ్రెడ్‌) ఓఎస్‌, 1.2 గిగాహెర్ట్జ్‌ ప్రాసెసర్‌, సమర్థమైన టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లేలు ఉన్నాయన్నారు. 3జీ రూ.18,000కు, 1ఐ 15,000 ధరలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 0.52 కేజీల అతి తక్కువ బరువుతో తీర్చిదిద్దిన బిజ్‌బుక్‌ ల్యాప్‌టాప్‌ కన్నా మంచి సౌకర్యాన్ని అందిస్తుందన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting