రాజమౌళి ‘మగధీర’ రేంజ్ లో..!!

Posted By: Staff

రాజమౌళి ‘మగధీర’ రేంజ్ లో..!!


‘‘టాబ్లెట్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2జీ, 3జీ వ్యవస్థలను ఆధునీకరిస్తూ ‘4జీ’ వ్యవస్థ ఆధారిత పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. దిగ్గజ ‘రిమ్’ సంస్థ 4జీ ఆధారిత బ్లాక్‌బెర్రీ ప్లే బుక్ పరికరాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కేవలం 450 గ్రాముల బరువుతో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పరికరాలు సామాన్య వినియోగదారులతో పాటు వ్యాపరవేత్తలకు మరింత లబ్థి చేకూరుస్తాయి..’’

ఫీచర్లు క్లుప్తంగాః బ్లాక్ బెర్రీ 1.0 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుకున్న ‘బ్రాక్ బెర్రీ 4జీ’ డ్యూయల్ కోర్ కోర్టెక్స్ A9 ప్రొసెసింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. పొందుపరిచిన 1 జీబీ ర్యామ్‌ను 16/32/64 జీబీ సైజుల్లో సామర్ధ్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. 3.5 mm ఆడియో జాక్, 7 అంగుళాల డిస్‌ప్లే టచ్‌స్ర్కీన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. మల్టీ‌టచ్ ఫీచర్లను గ్యాడ్జెట్‌లో పొందుపరిచారు.

టాబ్లెట్‌లోని ఇంటర్నెట్ అంశాలను పరిశీలిస్తే అధునాతన 21 Mbps HSDPA 3G, HSUPA, జీపీఆర్ఎస్, ఎడ్జ్ వంటి ఆప్లికేషన్లు వేగవంతంగా స్పందిస్తాయి. వేగవంతమైన 802.11 a/b/g/n వై - ఫై వ్యవస్థ, v2.1 A2DP బ్లూటూత్ వంటి అంశాలు మెరుగైన పని వ్యవస్థను కలిగి ఉంటాయి.

కెమెరా అంశాలను పరిశీలిస్తే 5 మెకా పిక్సల్ రేర్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా నాణ్యమైన చిత్రాలతో పాటు వీడియోలను మీకు అందిస్తుంది. పొందుపరిచిన పవర్ VR SGX540 యాక్సిలరేటర్ కార్డ్ హై డెఫినిషన్ నాణ్యతను కలిగి ఉంటుంది.

ఏర్పాటు చేసిన హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్ వెబ్‌సర్ఫింగ్‌ను సులభతరం చేస్తుంది. అనుసంధానించిన మీడియా ప్లేయర్లు నాణ్యమైన ఆడియో, వీడియో అనుభూతలను పంచుతాయి. 5300 mAh లయోన్ బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక మన్నికను కలిగి ఉంటుంది. త్వరలో విడుదలకాబోతున్న ఈ పరికరం ధర రూ.30000 ఉంటుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting