మార్కెట్లో ‘Blackberry Playbook 2’ ప్రకంపనలు..

Posted By: Staff

మార్కెట్లో ‘Blackberry Playbook 2’ ప్రకంపనలు..

సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ‘Blackberry’ ఏది చేసినా వినూత్నమే.. ఈ బ్రాండ్ ‘ఆఫీషియన్ లుక్’కి ఇప్పటికే చాలా మంది ఫ్లాట్ అయిన సంగతి తెలిసిందే. కొత్త ఆలోచనలను.. పరిశోధనలగా మలచి.. వచ్చిన ఫలితానికి సాంకేతికతను జోడించటంలో పై చేయి సాధించిన ‘ Blackberry ’ ఎప్పటికి అత్యుత్తమ బ్రాండే.

ఇటీవలే బ్లాక్ బెర్రీ ‘Blackberry Playbook’ పేరుతో ఓ పరికారన్ని మార్కెట్లో విడుదలచేసింది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్నఈ డివైజ్ మార్కెట్లో మంచి హిట్టే కొట్టిదనుకోండి.. అయితే ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో మరో ‘హాట్ న్యూస్’ అగ్రశ్రేణి కంపెనీలను కలవరానికి గురిచేస్తుందట, ‘Blackberry Playbook’ కి సీక్వెల్ గా ‘new Blackberry Playbook 2’ రూపుదిద్దుకోనుందట.

‘Blackberry Playbook’ వర్షన్ 1 మర్కెట్లో నడుస్తుండగా, రెండో వర్షన్ విడుదల ఎందుకుని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సందేహాల పై పలువురు విశ్లేషకులు స్పందిస్తూ ‘Blackberry Playbook’లో తలెత్తిన చిన్న చిన్న ఆసౌకర్యాలను సవరిస్తూ ‘new Blackberry Playbook 2’ రూపుదిద్దుకుంటుందట. అయితే ఈ అంశానికి సంబంధించి ‘Blackberry’ అధికారకంగా ఎటువంటి ప్రకటన విడేదల చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న ‘new Blackberry Playbook 2’ విశేషాలకు పరిశీలిస్తే 10 inch touch screenతో పాటు ఉన్నతమైన resolution కలిగి ఉంటుందట.

తాజాగా విడుదల కాబోతున్న ‘Playbook 2’ తెలుపు, నలుపు రెండు రంగుల్లో రూపుదిద్దుకుంటుందట. ‘QNX update’ వెసులబాటు కలిగి అత్యుత్తమ nternet based applicationsతో ఈ పరికరం పనిచేస్తుందట. అయితే ‘new Blackberry Playbook 2’ ధర విషయం తెలియాల్సి ఉంది. దీని ధర ఇంచుమించుగా ‘Blackberry Playbook ’ మొదటి వర్షన్ కి దగ్గర్లో ఉంటుందట.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot