బ్లాక్‌బెర్రీ మాస్టర్ ప్లాన్!

Posted By: Staff

బ్లాక్‌బెర్రీ మాస్టర్ ప్లాన్!

 

బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్స్ అలాగే టాబ్లెట్ పీసీల రూపకర్త , రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) 4జీ ఆధారిత టాబ్లెట్ పీసీని ఈ ఏడాది చివరాంకంలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల యూఎస్ఏలో నిర్వహించిన బ్లాక్‌బెర్రీ మొబైల్ ఈవెంట్ కార్యక్రమంలో సంస్థ సీఈవో తోర్స్‌టెన్ హీన్స్ వెల్లడించారు.

ఇదిలాఉండగా, రిమ్ 2012-13కు సంబంధించి భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిన పలు కీలకవివరాలను లీక్‌‍వీరులు బట్టబయలు చేశారు. వీరు బహిర్గతం చేసిన సమాచారం ప్రకారం 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే టాబ్లెట్ పీసీ ‘ప్లేబుక్ 4జీ’ని రిమ్ 2012 తొలి త్రైమాసికంలో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది. కాలింగ్ ఫీచర్‌ను మినహాయించి, పూర్తి స్థాయి సమాచార సాధనంగా ఈ డివైజ్‌ను వృద్ధి చేస్తున్నారు.

ఈ 4జీ వర్షన్ టాబ్లెట్ కంప్యూటర్‌లో శక్తివంతమైన డ్యూయల్ కోర్ 1.5జీబి సామర్ధ్యం గల ప్రాసెసర్‌‍తో పాటు ఉత్తమ పనితీరునందించే గ్రాఫిక్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసినట్లు సమాచారం. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే… 7 అంగుళాల మల్టీ టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600), 32జీబి, 64జీబి వంటి భిన్న మెమెరీ వేరియంట్‌లలో ఈ గ్యాడ్జెట్ లభ్యంకానుంది. రిమ్, 4జీ వర్షన్ పాటు ఎల్‌టీఈ వర్షన్ టాబ్లెట్ పీసీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot