బ్లాక్‌బెర్రీ 2012.. ఏప్రిల్‌లో ప్లేబుక్ ఎల్‌టీఈ!

Posted By: Prashanth

బ్లాక్‌బెర్రీ 2012.. ఏప్రిల్‌లో ప్లేబుక్ ఎల్‌టీఈ!

 

ఇటీవల ప్లేబుక్ టాబ్లెట్ పీసీల కోసం అపడేటెడ్ ఓఎస్‌ను విడుదల చేసిన బ్లాక్ బెర్రీ మరో ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. 4జీ వ్యవస్థను సపోర్ట్ చేసే ఎల్‌‌టీ‌ఈ వర్షన్ ప్లేబుక్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లోగా అందుబాటులోకి తేనున్నట్లు రిసెర్చ్ ఇన్ మోషన్(రిమ్) వర్గాలు వెల్లడించాయి. ఈ టాబ్లెట్ ఫీచర్లను పరిశీలిస్తే ఉన్నతమైన రిసల్యూషన్‌తో కూడిన 7 అంగుళాల టచ్ స్ర్కీన్, శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్, పటిష్టమైన 1జీబి ర్యామ్ వ్యవస్ధ, హై డెఫినిషన్ టీవీలకు జత చేసుకునే విధంగా హెచ్‌డిఎమ్ఐ పోర్టు, బ్లాక్‌బెర్రీ టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌలభ్యత, సిక్స్ యాక్షన్ మోషన్ సెన్సార్, ఇన్‌బుల్ట్ సోషల్ నెట్‌వర్కింగ్ ఆప్లికేషన్స్, వేగవంతమైన వెబ్ సర్వీసెస్.

ఈ ఏడాదిలోనే రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్స్:

వేగవంతమైన నెటవర్కింగ్‌కు దోహదపడే HSPA, LTE ఆధారిత స్మార్ట్ ఫోన్‌లను రిమ్ ఈ ఏడాదిలోనే విడుదల చేయునుందని విశ్వసనీయ వర్గాల సమచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot