కొత్త ‘వోఎస్’తో బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ 2012..?

Posted By: Super

కొత్త ‘వోఎస్’తో బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ 2012..?


‘బ్లాక్ బెర్రీ’ టాప్ సీక్రెట్ లీకైంది..?, విశ్వసనీయ వర్గాలు ఈ సమాచారాన్ని గుట్టు రట్టు చేసాయి..?, ‘రిసెర్చ్ ఇన్ మోషన్’ (రిమ్) తాజా ఎత్తుగడ ఏంటో తెలుసుకుందామా..

విడుదల కాబోతున్న తాజా ‘బ్లాక్‌బెర్రీ ప్లే బుక్’లో కొత్త ఆపరేటింగ్ వ్యవస్థను లోడ్ చేసేందుకు ‘రిసెర్చ్ ఇన్ మోషన్’ (రిమ్) పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ మార్కెట్లోని అధునాత ఫీచర్లను సపోర్టు చేసే విధంగా ‘బేటా వర్షన్’ ఆపరేటింగ్ వ్యవస్థ 2.0లో తీర్చిదిద్దుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఇప్పటికే మొబైల్ ఫోన్ మరియు టాబ్లెట్ పీసీల సెగ్మెంట్లో తనదైన ముద్రవేసుకున్న బ్లాక్‌బెర్రీ తాజా ప్రయోగం పై పూర్తి స్థాయిలో దృష్టిసారించింది. ఈ తాజా ఆపరేటింగ్ వ్యవస్థ ప్రయోగంతో సాంకేతిక ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికే యోచనలో రిమ్ సంస్ధ ఉంది.

2012 ప్రధమాంకంలో విడుదల కాబోతున్న ‘బ్లాక్ బెర్రీ ప్లేబుక్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. ఆండ్రాయిడ్ ఆధారిత పరికరాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ నెలకున్న నేపధ్యంలో ‘రిమ్’ తాజా ఆవిష్కరణ విజయవంతం అవుతుందని భావిస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot