మార్పు ఈ ఏడాదేనా...?

Posted By: Staff

మార్పు ఈ ఏడాదేనా...?

 

టాబ్లెట్ కంప్యూటర్స్ అదేవిధంగా స్మార్ట్ ఫోన్ తయారీ విభాగంలో తొలి పది కంపెనీల జాబితాలో ఉన్న రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) తాజా ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. బ్లాక్‌బెర్రీ10 ఆపరేటింగ్ సిస్టం పేరుతో కొత్త వోఎస్‌ను ఈ బ్రాండ్ వెలుగులోని తెస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలిగా ఆ వోఎస్‌ను బ్లాక్‌బెర్రీ ప్లే‌బుక్‌లో అప్‌డేట్ చేస్తారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వ్యక్తమవుతున్న ఊహాగానాలను కంపెనీ వర్గాలు అధికారికంగా ధ్ళవీకరించాల్సి ఉంది. బ్లాక్‌బెర్రీ10 వోఎస్ ఆధారితంగా పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లను 2012 చివరినాటికి రిమ్ అందుబాటులోకి తేనుంది. ప్రస్తుత నేపధ్యంలో బ్లాక్‌బెర్రీ ప్లేబుక్, 2.0 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్న విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot