బ్లాక్‌బెర్రీ 2012!!!

Posted By: Super

బ్లాక్‌బెర్రీ 2012!!!

 

2012 ఆవిష్కరణలకు సంబంధించి గ్యాడ్జెట్ దిగ్గజం ‘బ్లాక్‌బెర్రీ’పలు ఆసక్తికర నిర్ణయాలను తీర్మానించింది. 3జీ సామర్ద్యం గల హై‌ఎండ్ టాబ్లెట్ కంప్యూటర్‌లను ఈ ఏడు ప్రవేశపేట్టేందుకు బ్రాండ్ సన్నాహాలు చేస్తుంది. 7,10 అంగుళాల వేరింయట్‌లలో రాబోతున్న ఈ డివైజ్‌లు ‘బ్లాక్‌బెర్రీ టాబ్లెట్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం v2.0’ పై రన్ అవుతాయి. ఏప్రిల్, డిసెంబర్ మాసాల నాటికి ఈ గ్యాడ్జెట్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

టాబ్లెట్ సెక్టార్‌లో దూసుకుపోతున్న శామ్‌సంగ్, ఆపిల్‌లకు ఈ ఏడాది బ్లాక్‌బెర్రీ ప్రధాన పోటీదారుగా నిలుస్తుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అటు టాబ్లెట్ విభాగంతో పాటు స్మార్ట్‌ఫోన్ సెక్టార్ పై దృష్టికేంద్రీకరించిన బెర్రీ ‘బీబీఎక్స్ ఓఎస్’ ఆధారిత బ్లాక్‌బెర్రీ 10 స్లైడర్‌ ఫోన్ ‘మిలాన్’ను సెప్టంబర్ నాటికి విడుదల చేయాలన్న యోచనలో ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot